Breaking News

ప్రసూతి సెలవులు ‘ఇద్దరి’కే పరిమితమా?

Published on Fri, 09/05/2025 - 03:38

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళలకు ప్రసూతి సెలవులు ఇద్దరు బిడ్డలకే పరిమితమా.. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకుని తమ ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుపై ఉన్న పరిమితిని సవాలుచేస్తూ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ రాజీవ్‌గాంధీ నగర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.శ్వేత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

2010, మే 4 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 152ను సవాల్‌ చేశారు. ఈ జీవో ప్రకారం 180 రోజుల చొప్పున ప్రసూతి సెలవులకు అనుమతి ఉంటుందని.. అయితే ఇద్దరు పిల్లలకే పరిమితమని పేర్కొన్నారు. పరిమితిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున జీపీ ఎస్‌.సుమన్‌ విచారణకు హాజరై.. ప్రభుత్వం నుంచి సూచనలు పొందేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ వాయిదా వేసింది.  
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)