Breaking News

మార్గదర్శి విజ్ఞప్తికి అంగీకరించని హైకోర్టు!

Published on Mon, 11/04/2024 - 14:28

హైదరాబాద్‌, సాక్షి: మార్గదర్శి కేసు విచారణ సందర్భంగా.. ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను మీడియా ముందుకు వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలని మార్గదర్శి భావించింది.  అయితే.. అందుకు హైకోర్టు బ్రేకులు వేసింది. 

మార్గదర్శి కేసులో వాదనలు వినిపిస్తున్న ఉండవల్లి.. తరచూ మీడియా ముందుకు వచ్చి మార్గదర్శి అవినీతి తుట్టెను కదిలిస్తున్నారు. దీంతో ఆయనను మీడియా ముందుకు రానివ్వకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌ వేసింది మార్గదర్శి.  అయితే.. విచారణ చేపట్టకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం మార్గదర్శి లాయర్‌ సిద్ధార్థ లూథ్రాకు స్పష్టం చేసింది. ఈ తరుణంలో.. లూథ్రా తీరుపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

‘‘సుప్రీం కోర్టు సూచన మేరకు ఈ కేసులో హైకోర్టుకు సహకారం అందిస్తున్నా. నేను ఏ ఒక్కరి తరఫు లాయర్‌ కాదన్నది గుర్తుంచుకోవాలి. మీడియాతో నేను మాట్లాడి మూడు నెలలు దాటింది.  మార్గదర్శి లాయర్‌ తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు.

అనంతరం.. ఉండవల్లి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణ జరపకుండా ఉండవల్లికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని మార్గదర్శి లాయర్‌కు తేల్చి చెప్పింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)