Breaking News

కేడర్‌ వివాదం కేసు.. క్యాట్‌ ఉత్తర్వులు కొట్టివేత

Published on Wed, 01/03/2024 - 17:04

హైదరాబాద్‌, సాక్షి: ఏడేళ్లుగా సాగుతున్న.. ఏపీ-తెలంగాణ ఐఏఎస్‌, ఐపీఎస్‌ కేడర్‌ వివాదం కేసును ముగించింది ఎట్టకేలకు ముగించింది తెలంగాణ హైకోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్- క్యాట్‌(Central Administrative Tribunal) తీర్పును ఉన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకే కేడర్‌ కేటాయింపు ఉండాలన్న కేంద్రం వాదనతో ఏకీభవించిన కోర్టు.. మరోవైపు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల అభ్యంతరాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తన తీర్పులో స్పష్టం చేసింది. 

తాజా తీర్పులో..  ఏడేళ్ల కిందటి నాటి క్యాట్‌ తీర్పును కొట్టేయడంతో పాటుగా డీవోపీటీకి ఐఏఎస్‌, ఐపీఎస్‌లు తమ అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం కల్పించింది తెలంగాణ హైకోర్టు. అలాగే.. అధికారుల సీనియారిటీ, స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అప్పటివరకు ఇప్పుడున్న రాష్ట్రాల్లోనే విధులు కొనసాగించాలని ఆదేశించింది.

‘‘ఈ 13 మంది బ్యూరో క్రాట్ లు క్యాడర్ కేటాయింపు అంశంపై కేంద్రాన్ని అభ్యర్థించాలి. అధికారులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కొక్క అధికారి  అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలి. అధికారులు అవసరమైతే లీగల్‌గా ముందుకు వెళ్లొచ్చు. అధికారుల కేటాయింపుకు క్యాట్ లు ఎలాంటి హక్కు లేదు. బ్యూరో క్రాట్ ల కేటాయింపు కేవలం డీవోపీటీ పరిధిలో అంశమే’’ అని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. 

వివాదం ఏంటంటే..
రాష్ట్ర విభజన సమయంలో 14 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది కేంద్రం పరిధిలోని  డీవోపీటీ( Department of Personnel and Training). అయితే.. ఆ ఉత్తర్వుల్ని క్యాట్‌ కొట్టేసింది. తన కేటాయింపులు పక్కనపెట్టి మరీ క్యాట్‌ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ 2016లో డీవోపీటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.   

తన పరిధి దాటి బ్యూరోక్రాట్ లపై క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిందని వాదిస్తూ వచ్చింది. 2016 నుండి హైకోర్టు లో ఈ వివాదంపై విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కేటాయింపుల పై తుది వాదనలు ముగిశాయి. ఈ మధ్యలో కేడర్‌ కేటాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కు పంపుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే.. సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ గత ఏడాది హైకోర్ట్ ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో.. మిగిలిన 13 మంది అధికారుల క్యాడేర్ కేటాయింపు పై తుది వాదనలు ఇవాళ జరిగాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)