Breaking News

నిజాం షుగర్స్‌ పునఃప్రారంభానికి కట్టుబడి ఉన్నాం

Published on Sun, 02/25/2024 - 02:45

బోధన్‌: నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, నిజాం షుగర్స్‌ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఫ్యాక్టరీలను తెరిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. శనివారం బోధన్‌లోని ఫ్యాక్టరీని కమిటీ సభ్యులు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం ఫ్యాక్టరీని తెరిపించి లాభాల బాటలో నడిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే వ్యవసాయ, పారిశ్రామికరంగ నిపుణులతో చర్చిస్తున్నామని వివరించారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణాలు వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫ్యాక్టరీలను ప్రభుత్వమా లేక సహకార విధానంలోనా లేక ప్రైవేటు రంగంలోనా ఎలా నడపాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకొనేందుకు ఆలోచించకపోతే నిజాం షుగర్స్‌ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులా అవుతుందని వ్యాఖ్యానించారు. 

మార్పు చేసి చూపుతాం.. 
ప్రజలు ఆకాంక్షించిన మార్పును చేసి చూపుతామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ నెల 27న రూ. 500కే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలను ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. హైదరాబాద్‌ శివారులో జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్, నిజాం షుగర్స్‌ ఎండీ డాక్టర్‌ మక్సూద్, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)