తెలంగాణ వాహనదారులకు గుడ్‌ న్యూస్‌

Published on Tue, 12/26/2023 - 15:44

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వాహనదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల రాయితీపై తెలంగాణ సర్కార్‌ జీవో విడుదల చేసింది. నేటి నుంచే పెండింగ్‌ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. బైక్‌లు, ఆటోలకు 80 శాతం.. బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ వెహికల్స్‌కు 60 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

మంగళవారంనుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్‌ జరిమానాలను రాయితీతో చెల్లించొచ్చు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదా యం రానుంది. దీంతోపాటు పెండింగ్‌ చలాన్ల పేరిట ట్రాఫిక్‌ పోలీసులనుంచి ఎదురయ్యే ఇబ్బందునుంచి వాహనదారులకు విముక్తి లభించనుంది.

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ రూ ల్స్‌ను అతిక్రమించిన వాహనదారుల జరిమానాలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఇటీవల ట్రైసిటీ పరిధిలోని మూడు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లలో పనిచేసే అధికారులు, సిబ్బంది నగరంలోని వాహనదారులనుంచి జరిమానాలను ముక్కుపిండి వసూలు చేశారు. జరిమానాల్లో 50 శాతం చెల్లిస్తేనే వాహనాలను వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.

ఇదీ చదవండి: ‘బావ-బావమరిది చెమట కక్కి సంపాదించారా?’

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)