Breaking News

రైతులకు ఉచితంగా పంటల బీమా!

Published on Sun, 03/03/2024 - 05:15

సాక్షి, హైదరాబాద్‌: రైతులు పైసా ఖర్చు చేయకుండా ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం కింద రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన వాటా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌ నుంచి ఫసల్‌ బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా ఎక్కువగా ఉన్నందున గత ప్రభుత్వం ఈ బీమా పథకం నుంచి బయటకు వచ్చింది. దీంతో కొంతకాలంగా రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొత్త సర్కారు రైతుల ప్రీమియం వాటాను తామే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది.  

క్లస్టర్ల వారీగా అమలు 
వ్యవసాయ శాఖ వర్గాల అంచనా ప్రకారం..రాష్ట్ర రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సీజన్లకు కలిపి దాదాపు రూ.2 వేల కోట్లు బీమా కంపెనీలకు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అందులో రైతుల వాటా దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. కాగా ఫసల్‌ బీమా పథకంలో చేరే విషయమై కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది. పంటల బీమా పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు.

రాష్ట్రంలోని జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజిస్తారు. కాగా బీమా పథకంలో ఉన్న వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తారు. అకాల వర్షాలతో నష్టపోతే ఒక రకమైన ప్రీమియం, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు వర్షం పడి నష్టం జరిగితే మరో రకమైన ప్రీమియం, దిగుబడి తక్కువ వస్తే అందుకు సంబంధించి మరో ప్రీమియం ఇలా వివిధ రకాలుగా పథకంలో వెసులుబాట్లు ఉన్నాయి. దీంతో ఏ క్లస్టర్లలో ఎటువంటి వాతావరణం ఉంటుందన్న దానికి అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తారు. బీమా కంపెనీలు కోట్‌ చేసే ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్‌ రావడానికి ముందే పథకానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడనున్నాయి.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)