Breaking News

ఔటర్‌లో అడ్రస్‌ ఉంటేనే ఆటో

Published on Sat, 06/28/2025 - 13:59

సాక్షి, హైదరాబాద్: ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో నివాసం ఉండే డ్రైవర్లు కొత్త ఆటోలను కొనుగోలు చేసుకొనేందుకు మార్గం సుగమమైంది. కొత్త ఆటోరిక్షాలపై ఆంక్షలను ఎత్తివేస్తూ 65 వేల పరి్మట్‌లను  ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో  20 వేల ఎలక్ట్రిక్‌ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, మరో  10 వేల  సీఎన్‌జీ ఆటో పర్మిట్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 25వేల ఎల్పీజీ, డీజిల్, పెట్రోల్‌ ఆటోలను రిట్రోఫిట్‌మెంట్‌లు అమర్చు,కొని ఎలక్ట్రిక్‌ ఆటోలుగా మార్చుకొనేందుకు అవకాశం కలి్పంచింది. ఈ మేరకు కొత్త  ఆటో పరి్మట్‌లపై  రవాణా కమిషనర్‌ కె.సురేంద్రమోహన్‌ తాజాగా విధివిధానాలు విడుదల చేశారు.  

డాక్యుమెంట్‌లు తప్పనిసరి... 
ఆటో కొనుగోలు చేసే వ్యక్తి  ఔటర్‌ పరిధిలో తన అడ్రస్‌ను నిర్ధారించే రెండు డాక్యుమెంట్‌లను  తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. కొనుగోలుదార్ల  అడ్రస్‌ నిర్ధారణ  బాధ్యత డీలర్లదేనని  తెలిపారు. దరఖాస్తుదారు పూర్తి వివరాలతో పాటు ఆటో లేదా కారు డ్రైవింగ్‌ లైసెన్స్, ఆధార్, పుట్టిన తేదీ, ఔటర్‌ పరిధిలో రెండు అడ్రస్‌ ధ్రువీకరణ పత్రాలతో ఆటోరిక్షా డీలర్లను  సంప్రదించాలి. ఈ మేరకు  డీలర్లు  సీఎఫ్‌ఎస్‌టీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను ఆర్టీఏకు అందజేయాలి. ఇలా డాక్యుమెంట్‌లతో సహా తమకు అందిన  దరఖాస్తులను పరిశీలించి  24 గంటల్లో ఆర్టీఏ అధికారులు అనుమతులు అందజేస్తారు. అనుమతుల ఆధారంగా డ్రైవర్లు 60 రోజుల్లో కొత్త ఆటోను కొనుగోలు చేయవచ్చు. ఈ గడువు ప్రకారం కొనుగోలు చేయలేకపోతే ఆ అనుమతులకు చెల్లుబాటు ఉండదని కమిషనర్‌ తెలిపారు. కొత్తగా  65 వేల పరి్మట్లను విడుదల చేసిన దృష్ట్యా పాత పర్మిట్‌లను  రద్దు చేశారు. ఈ మేరకు పాత ఎల్పీజీ, డీజిల్, సీఎన్జీ పర్మిట్‌లపై కొత్త ఆటోలను కొనుగోలు చేసేందుకు వీలులేదని ఆయన పేర్కొన్నారు.   

బ్లాక్‌ మార్కెట్‌కు తెరపడేనా? 
ఆటో పర్మిట్‌లు  నగరంలోని ఫైనాన్షియర్‌లకు కాసులు కురిపిస్తున్నాయి. సుమారు 80 వేల పాత ఆటో పరి్మట్‌లను  తమ గుప్పిట్లో పెట్టుకున్న వ్యాపారులు ఒక్కో పరి్మట్‌ను రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పాత పరి్మట్‌లపైనే ఆటోడ్రైవర్లు కొత్త ఆటోలను కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఏటా భారీ ఎత్తున అక్రమ వ్యాపారం సాగుతోంది. ప్రభుత్వం ఈసారి ఏకంగా 65 వేల కొత్త ఆటోలకు అనుమతినిచి్చన దృష్ట్యా ఇప్పటికైనా ఫైనాన్షియర్‌ల దోపిడీ ఆగిపోవాలని ఆటో సంఘాలు ఆకాంక్షిస్తున్నాయి.

   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)