Breaking News

‘ఫోర్త్‌ సిటీ’ కోసం ప్రత్యేక అథారిటీ!

Published on Tue, 08/20/2024 - 06:26

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులోని ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి చేయనున్న ‘ఫోర్త్‌ సిటీ’కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ ప్రాంతాన్ని అన్ని వర్గాలకు అనువుగా ఉండే ఫ్యూచర్‌ సిటీ మాదిరి నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియలో వివిధ విభాగాల మధ్య సమన్వయంతోపాటు ప్రభుత్వ ఆలోచనల అమలును పర్యవేక్షించేలా అథారిటీ పనిచేయనుంది. ఈ అథారిటీకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వం వహించనున్నారని తెలిసింది.  

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం... 
హైదరాబాద్‌ మహానగరంలో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఫోర్త్‌ సిటీ అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఏర్పాటు చేయనున్న అథారిటీ సైబరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌తోపాటు దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉన్న నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్, గ్రేటర్‌ నోయిడా సహా మరికొన్ని సంస్థల పనితీరును అధ్యయనం చేయనుంది. ఆయా విభాగాల ఏర్పాటు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, తలెత్తిన ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగనుంది. 

సింగిల్‌ విండో విధానం ఉండేలా... 
కొత్తగా ఏర్పాటవుతున్న నగరం కావడంతో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు సైతం జరుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అథారిటీ అదీనంలో పని చేయడానికి రెవెన్యూ, పట్టణాభివృద్ధి తదితర విభాగాల సిబ్బందిని తీసుకురానున్నారని తెలిసింది. దీనివల్ల భూములు సమీకరణ, కేటాయింపు, అనుమతుల మంజూరు, మౌలిక వసతుల అభివృద్ధి.. ఇలా ప్రతి అంశంలోనూ సింగిల్‌ విండో విధానం అమలు చేయడం ద్వారా పెట్టుబడిదారులను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

సుదీర్ఘకాలం సజావుగా సాగేలా... 
‘గ్రేటర్‌’పరిధిలో రోడ్డు, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌ల వంటి విషయాల్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పాత నగరం, ఏళ్ల క్రితమే అభివృద్ధి చెందిన కొత్త నగరంలోనే కాదు.. గత కొన్నేళ్లుగా కొత్త హంగులు సంతరించుకుంటున్న ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌తోపాటు పశి్చమ ప్రాంతంలోనూ సమస్యలు తప్పట్లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా సమకాలీన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి విజన్‌ డాక్యుమెంట్‌ సైతం రూపొందించాలని యోచిస్తోంది. కనిష్టంగా రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్లు మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోనుంది. దీనికోసం అవసరమైతే ప్రత్యేక అ«థారిటీతో అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అధ్యయనం చేయించే అవకాశం ఉంది. 

కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు... 
త్వరలో జరగబోయే కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఉండనున్నాయని తెలిసింది. ఫ్యూచర్‌ సిటీ కోసం ప్రత్యేక అథారిటీ సహా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) సిబ్బంది, చట్టబద్ధతపైనా నిర్ణయాలు ఉండనున్నాయి. ప్రస్తుతానికి హైడ్రాను కేవలం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌గా పిలిచే జీవోతో ఏర్పాటు చేశారు. దీనికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించాలంటే చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. 

ఇందుకోసం మంత్రివర్గ సమావేశంలో విధాన నిర్ణయం తీసుకోనుంది. దీని ఆమోదం తర్వాత ముసాయిదా బిల్లు రూపొందించి అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్‌ అయ్యాక ఆర్డినెన్స్‌ జారీ చేయనుంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో హైడ్రా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రాలోకి నేరుగా నియమించుకొనే, డిప్యుటేషన్‌పై తీసుకొనే సిబ్బందిపైనా కేబినెట్‌లో నిర్ణయం ఉండనుందని సమాచారం.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)