Breaking News

బీఆర్‌ఎస్‌కు షాక్‌.. సర్కార్‌పై గులాబీ నేతలు ఫైర్‌

Published on Fri, 07/17/2026 - 11:57

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. రేపటి బీఆర్‌ఎస్‌ యువ సంగ్రామ సభకు అనుమతి లభించలేదు. బీఆర్‌ఎస్‌ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ నేతలు సుధీర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు చెప్పుకొచ్చారు. దీంతో, సభ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. కావాలనే అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతూ..‘యువ సంగ్రామ సదస్సుపై కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. రేపటి సరూర్‌ నగర్‌ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక అనుమతులు నిరాకరించారు. సీఎంవో మేరకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు. సభను అడ్డుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వెనుక సీఎంవో కార్యాలయం ప్రత్యక్ష ప్రమేయం ఉంది. యువ గొంతును అణిచివేసేందుకు పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోవడం దురదృష్టకరం. 

ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా యువత కోసం వెనకడుగు వేసేది లేదు. భారీగా తరలివచ్చే యువతను అడ్డుకునేందుకే ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. శాంతియుత సభకే అనుమతి నిరాకరించడం ఎందుకు?. యువత సమస్యలపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందా?. అనుమతుల నిరాకరణపై కోర్టును ఆశ్రయిస్తాం. పోలీసుల తీరుపై న్యాయపోరాటానికి సిద్ధం’ అని చెప్పుకొచ్చారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)