Breaking News

గురుకులాలకు 'ఖాళీ' గుబులు!

Published on Mon, 05/26/2025 - 05:35

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో అద్దె బకాయిల అంశం గుబులు పుట్టిస్తోంది. దాదాపు పది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించక పోవడంతో భవనాలు ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లపై యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు అద్దెకు సంబంధించిన ఒప్పందం గడువు ముగియడంతో తమ భవనాలు తక్షణమే ఖాళీ చేయాలని ఇప్పటికే 63 గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు యజమానులు కరాఖండిగా తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో గురుకుల సంస్థల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వ బకాయిలు పెద్దయెత్తున పేరుకుపోవడం, ప్రైవేటుకు ఇచ్చుకుంటే నెలా నెలా అద్దె ఠంఛనుగా వసూలు చేసుకోవచ్చని యజమానులు భావిస్తున్నట్లు తెలిసింది. మైనారిటీ గురుకులా ల్లోనూ అద్దెలు ఏడాదికి పైగా పెండింగ్‌లోనే ఉన్నాయి.

అద్దె లేదు.. నిర్వహణ భారం 
గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోని భవనాల యజమానులు ఎక్కువగా గురుకుల పాఠశాలలను ఖాళీ చేయాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని భవనాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో అద్దె సక్రమంగా రాని గురుకుల పాఠశాలలకు బదులుగా ఇతర ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అద్దెకిస్తే అద్దె నెలవారీ వస్తుందని, పైగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతో యజమానులు తమ భవనాలు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఏటా అద్దె పెంపు సైతం నిలిచిపోవడం కూడా ఇందుకు మరో కారణంగా కన్పిస్తోంది. 

ఇంకోవైపు భవనాలకు రెగ్యులర్‌ రిపేర్లు, కొన్ని గురుకులాల్లో తాగునీరు, ఇతర అవసరాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా తెచ్చి సరఫరా చేయాల్సి ఉండటంతో యజమానులకు ఇబ్బందికరంగా మారుతోంది. నెలవారీ అద్దెబిల్లు రాకపోగా.. ప్రతినెలా సొంతంగా ఖర్చులు భరించాల్సి రావడంతో వాటిని ఖాళీ చేయించడమే ఉత్తమం అని రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు భవనాల యజమానులు భావిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా భవనాలను ఖాళీ చేయాలని ఇప్పటికే ప్రిన్స్‌పల్స్‌కు స్పష్టం చేశారు. కొంతమంది యజమానులు ఇప్పటికే భవనాల గేట్లకు తాళాలు వేసినట్లు క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.  

అద్దె భవనాల్లో 662 గురుకులాలు
ప్రస్తుతం గురుకులాల అద్దె బకాయిలు రూ.215 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సొసైటీ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కాగా యజమానులు గురుకుల సొసైటీలపై ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం పైసా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే యజమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నాలుగు గురుకుల సొసైటీలుండగా..విద్యాశాఖ పరిధిలో జనరల్‌ గురుకుల సొసైటీ ఉంది. 

వీటి పరిధిలో 1,023 గురుకుల పాఠశాలలు, కళాశాలలున్నాయి. ఇందులో 662 విద్యా సంస్థలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి నెలకు సుమారు రూ.20 కోట్ల మేర అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో మొత్తం బకాయిలు రూ.215 కోట్లకు చేరాయి. వీటిని విడుదల చేయాలంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నా ఫలితం లేదని యజమానులు చెబుతున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)