Breaking News

మహానగరం.. 3 కార్పొరేషన్లు

Published on Thu, 02/12/2026 - 02:45

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ముఖచిత్రం మారింది. ఇటీవలే 150 వార్డుల నుంచి 300 వార్డులకు విస్తరించిన జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (టీ క్యూర్‌) వరకు (ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతం) విస్తరించి ప్రస్తుతం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులతో ఉన్న జీహెచ్‌ఎంసీని సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా విభజించింది. 

ఆయా కార్పొరేషన్ల పరిధిలో ఏయే జోన్లు వస్తాయో ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు ఏర్పాటుచేసిన ఈ కార్పొరేషన్లు వేటికవే ప్రత్యేక సంస్థ హోదాతో పనిచేస్తాయి. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ జీవో (నంబర్‌ 55) విడుదల చేశారు. గెజిట్‌ నోటిఫికేషన్‌కు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు లక్ష్యంగా విభజన చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.  

జయేశ్‌రంజన్‌కు పర్యవేక్షణ బాధ్యతలు 
ఈ మూడు కార్పొరేషన్ల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు స్పెషలాఫీసర్‌గా జయేశ్‌రంజన్‌ను నియమించారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరులో ఐదు కార్పొరేషన్లకు ఉమ్మడిగా ఒక చీఫ్‌ కమిషనర్‌ ఉండటం గమనార్హం. కాగా బుధవారం తెల్లవారేసరికే కార్పొరేషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకాల జీవోలు కనిపించడంతో 8 గంటలకు అటూఇటూగా సంబంధిత అధికారులు బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్‌ ఆఫీసర్‌గా జయేశ్‌రంజన్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం మొదటి అంతస్తులో మేయర్‌ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. 

తార్నాకలో ఏర్పాటైన మల్కాజిగిరి కార్పొరేషన్‌ కార్యాలయంలో కమిషనర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, న్యాక్‌లోని సైబరాబాద్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో జి.సృజన కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. పరిధి మారడంతో ఆర్‌వీ కర్ణన్‌ సైతం మరోమారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా తన చాంబర్‌లోనే బాధ్యతలు స్వీకరించారు. వీరితోపాటు ఆయా కార్యాలయాల్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులు బాధ్యతలు స్వీకరించగా, బదిలీ అయిన సిబ్బంది విధుల్లో చేరారు. కాగా సీఎస్‌ రామకృష్ణారావును ఆర్‌వీ కర్ణన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.  

మూడు వెబ్‌సైట్లు..త్వరలో టీ క్యూర్‌ యాప్‌ 
మూడు కార్పొరేషన్లకు వేర్వేరుగా వెబ్‌సైట్లను సైతం రూపొందించారు. ప్రజా ఫిర్యాదుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న‘మై జీహెచ్‌ఎంసీ యాప్‌’స్థానే ‘టీ క్యూర్‌’యాప్‌ అందుబాటులోకి రానుంది. 

వికేంద్రీకరణతో ప్రజలకు మేలు 
అధికార వికేంద్రీకరణ, ప్రజలకు సత్వర సేవలు లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా తొలుత మండల వ్యవస్థ ప్రవేశపెట్టారు. అనంతర కాలంలో ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారు. చిన్న పంచాయతీలనూ ప్రజలు ఆమోదించారు. వికేంద్రీకరణ ప్రజలకు సౌలభ్యంగా, సౌకర్యంగా ఉంటుంది. 
– జయేష్‌రంజన్, స్పెషలాఫీసర్‌  

మూడు కార్పొరేషన్లు ఇలా.. 
సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌: ఐటీ కారిడార్‌ను కలుపుతూ శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్లు. మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌: మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్‌ జోన్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌: జీహెచ్‌ఎంసీ పేరును కొనసాగిస్తూ ..సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో లేని మిగతా ఆరు జోన్లు (శంషాబాద్, రాజేంద్రనగర్, చారి్మనార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్‌). 



 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)