Breaking News

తెలంగాణలో కొత్తగా 300 వంతెనలు

Published on Wed, 02/22/2023 - 04:34

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రహదారుల మీదు­గా పారే వాగులు, వంకలపై కొత్తగా 300 వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణ­యిం­చింది. గత రెండేళ్లలో కురిసిన భారీ వర్షా­లు, వరదల వల్ల రోడ్లు, కల్వర్టులు తీవ్రం­గా దెబ్బతినడంతో ఆయా ప్రాంతా­ల్లో వెంటనే వంతెనలు నిర్మించి వరద పా­రేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని, లేకుంటే రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఇటీవల అధికారులు నివేదిక సమర్పించారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించడంతో అధికారులు సర్వే చేసి 300 ప్రాంతాల్లో వంతెనలు అవసరమని తేల్చారు. ఇప్పుడు వాటి­ల్లో 150 వంతెనల పనులను ప్రారంభించి వీలైనంత తొందరగా పూర్తి చేయనున్నారు. 

10 మీటర్ల నుంచి 50 మీటర్ల నిడివితో.. 
పంచాయతీ రోడ్లు పోను రాష్ట్ర స్థాయి రోడ్ల నిడివి 28 వేల కిలోమీటర్ల మేర ఉంది. వాటిల్లో కొన్ని చోట్లే వంతెనలు ఉన్నాయి. మిగతా చోట్ల పాత కల్వర్టులు, పాత బ్రిడ్జీలకే మరమ్మతులు చేస్తూ అధికారులు నెట్టుకొస్తున్నారు. గత రెండేళ్లలో వరదలకు 133 వంతెనలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాటిని ఎత్తుగా నిర్మించనున్నారు. వాగులు పారే మరో 167 చోట్ల వంతెనలు లేవు.

వర్షాకాలంలో ఆ రోడ్ల మీదుగానే వరద పారుతోంది. ఈ ప్రాంతాల్లో రూ. 635 కోట్లతో వంతెనలు నిర్మించనున్నారు. 10 మీటర్ల నుంచి 50 మీటర్ల నిడివితో వాటిని ఎత్తుగా నిర్మించనున్నారు. గత పదేళ్లలో వరదనీరు ఆయా ప్రాంతాల్లో ఎంత ఎత్తు, ఎంత వెడల్పుతో ప్రవహించిందన్న వివరాలను సేకరించిన అధికారులు ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో వంతెనల పొడవు, ఎత్తు నిర్ధారించారు. 

ప్రారంభమైన పునరుద్ధరణ పనులు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారి రాష్ట్ర రహదారులకు కాలానుగుణ పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నారు. దాదాపు 2 వేల కి.మీ. నిడివిగల రోడ్లను పటిష్టపరిచేలా మరమ్మతులు చేపట్టనున్నారు. వాటిని 1,187 పనులుగా విభజించగా ఇందులో ఇప్పటికే 126 పనులు పూర్తి చేశారు. మిగతా వాటిల్లో 173 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 474 పనులు టెండర్లు పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతావాటికి టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ మరమ్మతులకు రూ. 1,700 కోట్లు ఖర్చు కానుంది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)