Breaking News

Gaddar Awards: నంది అవార్డు ఇక గద్దర్‌ అవార్డు

Published on Wed, 01/31/2024 - 19:34

హైదరాబాద్‌, సాక్షి: కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నంది అవార్డులను గద్దర్‌ అవార్డులుగా పేరు మారుస్తూ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించనుంది. ఇక నుంచి కవులు కళాకారులకు నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు ఇస్తాం అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్వయంగా తెలియజేశారు.

బుధవారం(జనవరి 31) గద్దర్‌ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఇకపై గద్దరన్న పేరిట అవార్డులు ఇస్తాం. అర్హులైన కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఈ అవార్డులు ఇస్తాం. వచ్చే ఏడాది గద్దరన్న జయంతి నుంచి ఈ అవార్డుల ప్రదానం ఉంటుంది. త్వరలోనే జీవో రిలీజ్‌ చేస్తాం అని ప్రకటించారాయన. 

‘‘నంది అవార్డులు పునరుద్ధరించాలని సినిమా వాళ్లు అడిగారు. నంది అవార్డులు కాదు.. మా ప్రభుత్వం కచ్చితంగా అవార్డులు ఇస్తుంది.  గద్దర్‌ అవార్డుల పేరుతో పురస్కారాలు ఇస్తాం. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఇచ్చే అధికారిక అవార్డులకు గద్దర్‌ అవార్డు ఇస్తాం. ఇదే శాసనం.. నా మాటే జీవో’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. 

ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక నుంచి ట్యాంక్‌బండ్‌పై గద్దర్‌ విగ్రహ ఏర్పాటునకు కృషి చేస్తామని రేవంత్‌ ప్రకటించారు. మరోవైపు తెల్లపూర్‌(సంగారెడ్డి) మున్సిపాలిటీలో గద్దర్‌ విగ్రహ(తొలి!) ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)