Breaking News

‘లగచర్ల’లో మళ్లీ భూసేకరణ..నోటిఫికేషన్‌ విడుదల

Published on Sat, 11/30/2024 - 08:12

సాక్షి,వికారాబాద్‌: లగచర్లలో భూ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. శుక్రవారమే లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ రద్దు చేసిన ప్రభుత్వం మరుసటి రోజే అక్కడ మల్టీపర్పస్‌ పారిశ్రామిక పార్క్‌ కోసం భూ సేకరణ నోటీస్‌ ఇచ్చింది. వికారాబాద్ జిల్లా దూద్వాల్ మండలం,పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

2013 చట్టం సెక్షన్ 6(2) కింద భూసేకరణను నోటిఫికేషన్‌ ఇచ్చారు.కాగా,వికారాబాద్‌ లగచర్లలో ఫార్మాసిటీ భూ సేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమించిన విషయం తెలిసిందే. భూ సేకరణ విషయమై గగ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌పై దాడికి యత్నించడం సంచలనంగా మారింది.

ఈ కేసులో కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు చేసిందని అంతా భావించారు. అయితే ఇంతలోపే మళ్లీ భూ సేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేయడం చర్చకు దారి తీసింది.

ఇదీ చదవండి: లగచర్ల ‘ఫార్మా’ రద్దు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌