Breaking News

తెలంగాణ జెన్‌కో ఎగ్జామ్‌ వాయిదా

Published on Tue, 12/12/2023 - 18:04

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి పరీక్ష వాయిదా పడింది. జెన్‌కో రాత పరీక్షను వాయిదా వేస్తూ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వెలువడింది. ఈ నెల 17వ తేదీన పరీక్ష జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు మంగళవారం సదరు ప్రకటనలో జెన్‌కో తెలిపింది. 

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌  ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, కెమిస్ట్‌ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది అక్టోబర్‌ 4వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది.  ఈ నెల 17వ తేదీన రాత పరీక్ష నిర్వహించాలనుకుంది. కానీ, అదే రోజు మరికొన్ని పరీక్షలు ఉన్నాయి. దీంతో పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి జెన్‌కోకు విజ్ఞప్తులు వచ్చాయి. అదే సమయంలో తాజాగా కొందరు అభ్యర్థులు డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు. 

దీంతో పరీక్ష వాయిదా వేసేందుకే జెన్‌కో మొగ్గు చూపింది. అయితే తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించేది స్పష్టత ఇవ్వలేదు. కానీ, జెన్‌కో వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను పెడతామని పేర్కొంది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)