Breaking News

రైతు భరోసా వస్తుందా.. రాదా?

Published on Sat, 03/07/2026 - 11:59

నల్లగొండ అగ్రికల్చర్‌ : యాసంగి సీజన్‌ రైతు భరోసా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. యాసంగి సీజన్‌ ముగిసి నెలరోజులు దాటింది. మరో 10, 15 రోజుల్లో నాన్‌ ఆయకట్టు ప్రాంతంలో వరి కోతలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసాపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడుతుంది. గత యాసంగిలో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జనవరి 26న రైతుల ఖాతాల్లో ఎకరానికి 6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత యాసంగిలో రైతు భరోసా ఇంకా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుందో చేయదో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. 

5,16,327 ఎకరాల్లో యాసంగి సాగు..
ప్రస్తుత యాసంగి సీజన్‌ జిల్లా వ్యాప్తంగా 5,16,327 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు సాగయ్యాయి. వరి సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెట్టుబడుల సమయంలో రైతుభరోసా అందక రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని యాసంగి సాగును పూర్తి చేశారు. రైతు భరోసా వస్తుందనే ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. రైతు భరోసా డబ్బులు వస్తే కొంత ఆసరాగా ఉండేది. కానీ ప్రభుత్వం దానిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

5,65,803 మంది రైతులు..
జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదారు పాస్‌ పుస్తకాలున్న రైతులు ఉన్నరు. ఎకరాలకు 6 వేల చొప్పున రూ.738.67 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

పెట్టుబడి సాయం ఇస్తే అప్పులు తీర్చుకుంటాం
ప్రభుత్వం స్పందించి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలి. యాసంగి సీజన్‌ సాగు కోసం పెట్టుబడుల కోసం ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాం. రైతు భరోసా నిధులు జమ చేస్తే అప్పులు తీర్చుకుంటాం. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రైతు భరోసా ఇవ్వాలి. 
– చిమట భిక్షమయ్య, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)