Breaking News

ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో మాకు తెలుసు: డీజీపీ శివధర్‌రెడ్డి

Published on Tue, 12/30/2025 - 12:29

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ పోలీసులు ఎంతో సేవాభావంతో పని చేస్తున్నారని.. ప్రాణాలకు తెగించి శాంతిభద్రతలను రక్షిస్తున్నారని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. 2025 ఏడాదికిగానూ పోలీసుల పనితీరుపై నివేదికను మంగళవారం వార్షిక పాత్రికేయ సమావేశంలో ఆయన వివరించారు. 

ఈ ఏడాది రాష్ట్రంలో శాంతి భధ్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. తెలంగాణ పోలీసులు ఎంతో సేవాభావంతో పని చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి శాంతి భద్రతలను రక్షిస్తున్నారు. 2025లో తెలంగాణలో 782 హత్యలు జరిగాయి. క్రైమ్‌ రేట్‌ 2.33 శాతం తగ్గింది. ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వర్షాలు.. వరదల సమయంలో సహాయక బృందాలతో సమన్వయంగా పోలీసులు పని చేశారు.

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జాతీయ, అంతర్జాతీయ సభలను అడ్డంకులు లేకుండా జరుపుకున్నాం. ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ పర్యటన కూడా విజయవంతమైంది. తెలంగాణ స్టేట్‌ టాప్‌ పోలీసింగ్‌గా ఉంది. తెలంగాణ టూరిస్ట్‌ పోలీస్‌ పెట్టాం. అందులో 80 మంది సిబ్బంది ఉన్నారు. ఫీడ్‌ బ్యాక్‌ కోసం ప్రతీ పీఎస్‌లో క్యూఆర్‌ కోడ్‌ పెట్టాం’’ అని వివరించారాయన. 

ఈ క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో పాటు ఐబొమ్మ రవి కేసుపైనా స్పందించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదు. ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో మాకు తెలుసు’’ అని అన్నారాయన.

క్రైమ్ ట్రెండ్‌.. గత 5 సంవత్సరాల (జనవరి నుండి నవంబర్ వరకు) నేరాల తులనాత్మక నివేదిక👇

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)