సాయుధ దళాలు.. వినూత్నంగా ఉండాలి  

Published on Mon, 12/18/2023 - 05:00

సాక్షి, హైదరాబాద్‌:  సాయుధ దళాలలో సంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే.. కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలు తేవాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. కొత్త ఆలోచనలు చేయకుండా చాలా కాలం ఒకే తరహా సంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. యువ అధికారులు తమలో నూతనత్వానికి, వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ శివార్లలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ ( ఇఎ్క) జరిగింది. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 213 ఫ్లైట్‌ కేడెట్లు (వీరిలో 25 మంది మహిళలు) పాల్గొన్నారు. 

గౌరవ వందనం స్వీకరించి.. 
పరేడ్‌కు సమీక్ష అధికారిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొని యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యువ కేడెట్లు భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లోకి చేరడానికి సూచికగా వారందరికీ అధికారిక హోదా కల్పిస్తూ రాష్ట్రపతి కమిషన్‌ (అధికారిక బ్యాడ్జ్‌లను)ను ప్రదానం చేశారు. తర్వాత రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రసంగించారు. ‘‘నిరంతరం అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలు, ఆవిష్కర ణల మధ్య సమతుల్యత సాధించండి. సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తే.. మనం ఎండిపోయిన సరస్సులా మారిపోతాం.

మనం ప్రవహించే నదిలా ఉండాలి. ఇందుకు సంప్రదాయంతోపాటు కొత్తదనాన్ని తీసుకురావాలి. వాయుసేన అధికారులుగా మీరు ఆకాశంలో ఎగురుతూ ఉండండి. ఎక్కు వ ఎత్తును తాకండి, కానీ నేలతో మీ సంబంధాన్ని కొనసాగించండి’’అని పిలుపునిచ్చారు. అకాడమీలో భారత వాయుసేనకు చెందిన అధికారులతోపాటు నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, కోస్ట్‌ గార్డ్‌ (తీర రక్షక దళం) నుంచి 9 మంది, స్నేహపూర్వక దేశమైన వియత్నాం నుంచి ఇద్దరు అధికారులు కూడా ఫ్లయింగ్‌ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ నుంచి అవార్డులు అందుకున్నారు.

శిక్షణలో టాపర్‌గా నిలిచిన ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ అతుల్‌ ప్రకాశ్‌ రాష్ట్రపతి ఫలకాన్ని చీఫ్‌ ఆఫ్‌ ది ఎయిర్‌ స్టాఫ్‌ స్వోర్డ్‌ ఆఫ్‌ హానర్‌ను రాజ్‌నాథ్‌ చేతులమీదుగా అందుకున్నారు. గ్రౌండ్‌ డ్యూటీ బ్రాంచ్‌లలో మెరిట్లో నిలిచిన ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ అమరీందర్‌ జీత్‌ సింగ్‌కు రాష్ట్రపతి ఫలకం లభించింది. అంతకుముందు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి, యువ కేడెట్లతో ప్రమాణం చేయించారు. 

ఆకట్టుకున్న కవాతు 
శిక్షణలో ప్రథమస్థానంలో నిలిచిన ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ అతుల్‌ ప్రకాశ్‌ ఆదివారం నాటి కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువ ఫ్లయింగ్‌ కేడెట్లు చేసిన కవాతు ఆకట్టుకుంది. పరేడ్‌ అనంతరం భారత వాయుసేన నిర్వహించిన వైమానిక ప్రదర్శన అలరించింది. సారంగ్‌ హెలికాప్టర్‌ బృందం, సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ బృంద విన్యాసాలు, సుఖోయ్‌–30 ఎంకేఐ గగనతల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్‌ అధికారులతోపాటు యువ ఫ్లయింగ్‌ ఆఫీసర్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)