Breaking News

+92 నంబర్‌తో కాలింగ్‌

Published on Sat, 07/20/2024 - 04:52

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు కొత్తకొత్త మోసాలకు దారులు వెతుకుతున్నారు. వాట్సాప్‌ డీపీగా పోలీస్‌ ఉన్నతాధికారుల ఫొటోలను పెట్టుకుని, ఆ నంబర్ల నుంచి పలువురికి వాట్సాప్‌ వాయిస్‌ కాల్స్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి బెదిరింపుల వీడియో ఒకటి డీజీపీ జితేందర్‌ తన అధికారిక ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. అనుమానాస్పద కాల్స్‌ వస్తే నమ్మి మోస పోకుండా.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ సీఎస్, డీజీపీ పేరిట గతంలోనూ వాట్సాప్‌ డీపీలతో డబ్బులు డిమాండ్‌
⇒ ఈ ఏడాది ఏప్రిల్‌ 30న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఫొటోను వాట్సాప్‌డీపీగా పెట్టిన సైబర్‌ నేరగాళ్లు..సీఎస్‌ పేరిట నలుగురు వ్యక్తులకు మెసేజ్‌లు పెట్టారు. అందులో రంజాన్‌ గిప్ట్‌ కూపన్లు పంపాలని కోరడంతో అనుమానాస్పదంగా భావించిన సదరు వ్యక్తులు సీఎస్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు.

⇒ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా డీజీపీగా పనిచేసిన సమయంలో ఆయన ఫొటోను డీపీగా పెట్టిన నంబర్‌తో ఈ ఏడాది మే 21న ఓ వ్యాపారికి వాట్సాప్‌ కాల్‌ వెళ్లింది. ‘మీ అమ్మాయిని నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేశారు. ఆమెను విడుదల చేయాలంటే రూ.50 వేలు మొబైల్‌ పేమెంట్‌ ద్వారా పంపండి అని సైబర్‌ నేరగాళ్లు డిమాండ్‌ చేశారు. దీనిపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు.

⇒ ఈ ఏడాది మే 23న వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ పి.ప్రావిణ్య ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టి కొందరు సైబర్‌నేరగాళ్లు ఆమె పేరిట డబ్బులు పంపాలంటూ కలెక్టరేట్‌ సిబ్బందితో పాటు కొందరు ప్రజలకు వాట్సాప్‌ మెసేజ్‌లు పంపారు. విషయం తన దృష్టికి రావడంతో కలెక్టర్‌ వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు..ప్రజలు, అధికారులు ఎవరూ అలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు.

+92 నంబర్‌తో వస్తే అది మోసం..  
మీ వాట్సాప్‌కు పోలీసుల పేరిట బెదిరింపు కాల్స్‌ వస్తే అందులో ఉన్న నంబర్‌ ఏ సంఖ్యతో మొదలైందో గమనించాలి. ఒకవేళ అది +92 నంబర్‌తో వస్తే.. పక్కాగా అది సైబర్‌ నేరగాళ్లపనే అని గుర్తించాలి. వాస్తవానికి +92 కోడ్‌ పాకి స్తాన్‌ది. చాలావరకు ఈ నంబర్‌తో కాల్స్‌ పాకి స్తాన్‌ నుంచే వస్తాయని, కొన్నిసార్లు కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లతోనూ ఇలాంటికాల్స్‌ జనరేట్‌ చేయవచ్చని సైబర్‌ భద్రత నిపుణులు చెబుతున్నారు. 

అనుమానం వస్తే సంచార్‌ సాథీ పోర్టల్‌ దృష్టికి తేవాలి.. 
మీకు తెలియని నంబర్‌ నుంచి +92తో ప్రారంభమయ్యే కాల్‌ వచి్చ.. అందులో అవతలి వ్యక్తి మీ వ్యక్తిగత వివరాలు.. మీ ఆధార్‌ నంబర్, బ్యాంక్‌ లాగిన్‌ వివరాలు లేదా ఓటీపీలు.. ఏవైనా అడిగితే చెప్పవద్దు. అలాంటి అనుమానాస్పద నంబర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తే వెంటనే సంచార్‌ సాథీ పోర్టల్‌ (ఠీఠీఠీ. ట్చnఛిజ్చిట ట్చ్చ్టజిజీ.జౌఠి.జీn)‘చక్షు–రిపోర్ట్‌ సస్పెక్టెడ్‌ ఫ్రాడ్‌ కమ్యూనికేషన్స్‌’లో మోసపూరిత సమాచారాన్ని తెలియజేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ ప్రజలకు సూచించింది.  

ఫేక్‌ వాట్సాప్‌కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. 
పోలీస్‌ అధికారుల ఫొటోలను డీపీగా పెట్టుకు న్న అపరిచితులు ఫోన్‌ చేసి మీకు సంబంధించి న వాళ్లు పోలీసులకు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్‌ డ్రగ్స్‌ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. – జితేందర్, డీజీపీ, తెలంగాణ  

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)