Breaking News

కూసుమంచిలో ‘ఇందిరమ్మ’ నమూనా ఇల్లు

Published on Mon, 01/13/2025 - 02:20

కూసుమంచి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భా గంగా ప్రభుత్వం మొదటి మోడల్‌ హౌస్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుండగా లబ్ధిదారులకు రూ.5 లక్షలు చెల్లిస్తామని ప్రకటించించిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతీ మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించాలని అధికా రులు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో గతనెల 13న నమూ నా ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయగా కేవ లం 30 రోజుల్లో శనివారం సాయంత్రానికి పూర్తిచేశారు.

ఈ ఇంటిని సోమవా రం మంత్రి పొంగులేటి ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోనే తొలి నమూ నా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి రానుంది. కాగా, ఇదే నమూనాలో ఇంటిని నిర్మించుకోవాలనే నిబంధన ఏదీ లేకపోయినా.. రూ.5 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తిచేయొచ్చని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు.

ఆకర్షణీయంగా నమూనా ఇల్లు..
కూసుమంచిలో 400 చదరపు అడుగుల్లో హాల్, కిచెన్, అటాచ్డ్‌ బాత్‌రూంతో బెడ్‌ రూంను నిర్మించారు. ఇంటి లోప లి గదు లు, ముందు వరండాలో టైల్స్‌ వేశారు. అలాగే, డా బా మెట్ల కింద టాయిలెట్‌ను నిర్మించారు. ఇంట్లో విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించి ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇంటికి రంగులు, ఇతరత్రా వసతులను రూ.5 లక్షలతోనే పూర్తిచేసినట్లు కాంట్రాక్టర్‌ కంచర్ల జీవన్‌రెడ్డి తెలిపారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)