Breaking News

సీపీఐకి ఒకటి.. ఎస్టీ నేతకు మరొకటి!

Published on Sat, 03/08/2025 - 05:28

సాక్షి, హైదరాబాద్‌:  ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం అధికార కాంగ్రెస్‌ చేపట్టిన కసరత్తు తుదిదశకు చేరుకుంది. వచ్చే సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను టీపీసీసీ వేగవంతం చేసింది. ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశమున్న నేపథ్యంలో.. ఒక సీటును మిత్రపక్షమైన సీపీఐకి ఇవ్వాలని, మిగతా మూడింటిలో ఒక స్థానాన్ని ఎస్టీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అందులోనూ మహిళకు అవకాశమివ్వాలని ఇటీవల సీఎం రేవంత్‌ నివాసంలో జరిగిన భేటీలో నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మిగతా రెండింటి కోసం ఎస్సీ, ఓసీ, బీసీ వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. 

ఢిల్లీలో అభ్యర్థుల ఖరారు.. 
కేబినెట్‌ విస్తరణతో ముడిపెట్టి జరుగుతున్న కసరత్తులో భాగంగా ఈ మూడు సామాజిక వర్గాల నుంచి అవకాశం కలి్పంచాల్సి ఉంటుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రెండు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి, రెండు రాజ్యసభ ఎంపీ స్థానాల్లో ఒకటి చొప్పున బీసీలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో.. ఈసారి బీసీ నేతలకు ఎమ్మెల్సీ అవకాశం ఉండకపోవచ్చని గాం«దీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఎస్టీ, ఎస్సీ, ఓసీ వర్గాల నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయవచ్చని అంటున్నారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా జరగనుంది.

అధిష్టానం పెద్దలు కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యేందుకు గాను సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ శనివారం మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం ఉదయం ఏఐసీసీ పెద్దలతో భేటీ అయి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మధ్యాహా్ననికల్లా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

మిత్ర పక్షానికి.. 
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మిత్రపక్షం సీపీఐకి అవకాశం ఇవ్వడం దాదాపు ఖరారైనట్టేనని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తులో భాగంగా, నాడు ఇచ్చిన మాట ప్రకారం సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించిందని.. ఈ మేరకు టీపీసీసీ నాయకత్వానికి సమాచారం ఇచ్చిందని పేర్కొంటున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)