Breaking News

అందెశ్రీ పాడె మోసి.. అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌

Published on Tue, 11/11/2025 - 09:05

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(అందె ఎల్లయ్య) అంత్యక్రియలు ముగిశాయి. ఘట్‌కేసర్‌ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో పోలీస్‌ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సహజ కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా జనం తరలి వచ్చారు. 

అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, కవులు, కళాకారులు, మేధావులు, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ హాజరయ్యారు. అందెశ్రీ పార్థీవ దేహానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను సీఎం రేవంత్‌ ఓదార్చారు. అందెశ్రీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోయ్యారు. ఆపై అందెశ్రీ పాడెను సీఎం రేవంత్‌ మోశారు. 

అందెశ్రీ(64) సోమవారం ఉదయం ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గేయం జయజయహే తెలంగాణ..తో పాటు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని రగల్చిన అనేక పాటలను రాశారాయన. సాహితీ లోకానికి గర్వకారణమైన అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రేవంత్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

నిన్నటి నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు అందెశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించారు.  ఈ ఉదయం సీనియర్‌ నేత కే కేశవరావుతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్కతో పాటు సీనియర్‌ నేత వీహెచ్‌లు నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. లాలాపేట్‌ నుంచి తార్నాక, ఉప్పల్‌ మీదుగా.. ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ వరకు అంతిమయాత్ర కొనసాగింది. దారిపొడవునా అభిమానులు పూలు జల్లి అందెశ్రీకి నివాళులు సమర్పించారు.

Ande Sri Final Rites: పాడె మోసిన సీఎం రేవంత్

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు