Breaking News

ఉచితాల కోసం కొత్త డిస్కమ్‌

Published on Thu, 07/31/2025 - 02:39

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌) ఏర్పాటు కానుంది. వ్యవసాయానికి, ఇళ్లకు 200 యూనిట్ల వరకు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను పర్యవేక్షించేందుకు వీలుగా ఒక ప్రత్యేక డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇది రాష్ట్రం యూనిట్‌గా పని చేస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షిస్తుందని చెప్పారు. డిస్కమ్‌ల స్థితిగతులు, ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడాలంటే విధిగా విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారం తగ్గించుకునేందుకు వీలుగా రీస్ట్రక్చరింగ్‌కు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీలు హరీశ్, కృష్ణభాస్కర్‌.. డిస్కమ్‌ల సీఎండీలు ముషారఫ్, వరుణ్‌రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం, రెడ్‌కో ఎండీ అనిల తదితరులతో సీఎం సమీక్ష జరిపారు.  

అధిక వడ్డీ రుణాలతో డిస్కమ్‌లు డీలా.. 
    విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్‌ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతమున్న సదరన్, నార్తర్న్‌ డిస్కమ్‌లకు అదనంగా మరో డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త డిస్కమ్‌ పరిధిలోకి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్‌ పథకాలన్నీ తీసుకు రావడం వల్ల ప్రస్తుతం ఉన్న డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. డిస్కమ్‌ల పునర్వ్యవస్థీకరణతో వాటిపై ఉన్న రుణ భారం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. పది శాతం వడ్డీతో తీసుకున్న రుణాలతో డిస్కమ్‌లు డీలా పడ్డాయని అన్నారు.  

స్కూళ్లు, సర్కారు కార్యాలయాలకు సౌర విద్యుత్‌ 
    రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్‌ విద్యుత్‌ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలన్నారు. రాష్ట్ర సచివాలయానికి కూడా సౌర విద్యుత్‌ అందించాలని, వెంటనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎండాకాలంలో సచివాలయంలో వాహనాల పార్కింగ్‌ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో సోలార్‌ రూఫ్‌ టాప్‌ షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.  

2.10 లక్షల మంది ఎస్టీ రైతులకు లబ్ధి చేకూర్చాలి 
    ఇందిర సోలార్‌ గిరి జల వికాసం పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మూడేళ్లలో 2.10 లక్షల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్‌ పంపుసెట్లను అందించాలని చెప్పారు.   

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)