Breaking News

సీఎం రేవంత్‌.. హార్వర్డ్‌ స్టూడెంట్‌!

Published on Mon, 01/19/2026 - 08:54

సాక్షి, హైదరాబాద్‌: ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలోని కెన్నడీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ నిర్వహించే ‘నాయకత్వం: 21వ శతాబ్దం’ అనే కోర్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశం పొందారు. మసాచ్యూసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న కెన్నడీ స్కూల్‌ క్యాంపస్‌లో ఈ నెల 25 నుంచి 30 వరకు జరగనున్న తరగతి గది విద్యాబోధనకు సీఎం రేవంత్‌ హాజరు కానున్నారు.

ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులు, ఘర్షణలు, వాటిని ఎదుర్కోవడంలో అవసరమైన అంశాలను ఈ కోర్సులో బోధించనున్నారు. అమెరికాలోని అత్యుత్తమ ప్రైవేటు వర్సిటీ (ఐవీ లీగ్‌)ల్లో ఒకటైన హార్వర్డ్‌లో ప్రవేశం పొందిన స్వతంత్ర భారతదేశ తొలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఐదు ఖండాల పరిధిలోని 20 దేశాల నుంచి అభ్యర్థులు ఈ కోర్సులో చేరి­నట్లు తెలిపింది.

సీఎం రేవంత్‌ తరగతులకు హాజరై అసైన్‌మెంట్లు, హోమ్‌­వర్క్‌తోపాటు సహ విద్యార్థులతో కలిసి గ్రూప్‌ ప్రాజెక్టులను పూర్తి చేయను­న్నట్టు పేర్కొంది. ప్రొఫెసర్‌ టిమ్‌ ఓబ్రియన్‌ ఈ కోర్సుకు అధ్యక్షుడిగా, ప్రొఫెసర్‌ కరెన్‌ మొరిస్సే కోర్సు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ప్రపంచంలోని విభిన్న ప్రాంతాలు, వేర్వేరు సమయాలకు సంబంధించిన చరిత్రను కోర్సులో భాగంగా విశ్లేషించనున్నారు. ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలను విద్యార్థుల గ్రూపులకు సూచించనున్నారు. కోర్సు పూర్తయ్యాక సీఎం రేవంత్‌ హార్వర్డ్‌ నుంచి సర్టిఫికెట్‌ పొందనున్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)