Breaking News

ఆర్థిక నేరాల కట్టడికి చర్యలు

Published on Mon, 03/03/2025 - 04:45

సాక్షి, హైదరాబాద్‌: నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడమే కాదు.. నేరం జరగకుండా నిలువరించడం కూడా పోలీసుల ప్రథమ కర్తవ్యం. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఆర్థిక నేరాల విషయంలోనూ ఇదే సూత్రాన్ని అవలంబిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఎక్కడో కూర్చుని ఇక్కడి ప్రజల బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టి.. వారి కష్టార్జితాన్ని ఎగరేసుకుపోతున్న సైబర్‌నేరగాళ్ల కట్టడికి ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 

మల్టీలెవల్‌ మార్కెటింగ్, ఆన్‌లైన్‌లో మోసగించే వారిపై ఫోకస్‌పెట్టి.. ఆదిలోనే అలాంటి నేరాల కట్టడికి తెలంగాణ సీఐడీలో మరో నూతన యూనిట్‌ను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సైబర్‌నేరాల కట్టడికి తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోను అదేవిధంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల కట్టడికి టీజీ యాంటీనార్కోటిక్స్‌ బ్యూరోను ఏర్పాటు చేసినట్టే, ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టేందుకు తెలంగాణ సీఐడీలో అంతర్భాగంగా ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.  

మోసపూరిత ప్రకటనలు ఇచ్చేవారిపై నిఘా..  
ఈ విభాగం ప్రధానంగా ఈ కామర్స్‌ సైట్స్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌ సహా అన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నకిలీ, మోసపూరిత వాణిజ్య ప్రకటనలు ఇచ్చేవారిపై నిఘా పెడుతుంది. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌తో లాభాలు వస్తాయని, పార్ట్‌టైం జాబ్స్‌ ఇస్తామని.. పలు రకాల స్కీంలతో ప్రకటనలు ఇచ్చే వారిపై నకిలీ వివరాలతో ఏర్పాటు చేసుకున్న ఖాతాలతో డెకాయి ఆపరేషన్స్‌ చేస్తుంది. 

ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనల్లో నంబర్లు, అడ్రస్‌లు, వ్యక్తుల గురించి ఆరా తీస్తుంది. ఇందులోని అధికారులు తాము కూడా ఒక వినియోగదారుడిగా అవతలి వ్యక్తులతో (మోసపూరిత ప్రకటనలు ఇచ్చిన వారితో) సంప్రదింపులు చేస్తూ, వారి వివరాలు కనుగొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అలా కాకుండా మోసాలకు పాల్పడే వారిని ఆదిలోనే గుర్తిస్తే.. అమాయక పౌరులు వారి వలలో పడి మోసపోకుండా ముందుగానే కట్టడి చేయవచ్చన్నదే ఈ నూతన వింగ్‌ ఏర్పాటు ఆలోచన వెనుక ప్రధాన ఉద్దేశం. 

ఇలా చేయడం ద్వారా ఆర్థిక మోసాల బారి నుంచి ప్రజలను కాపాడటంతోపాటు వారిని అప్రమత్తం చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నూతన వింగ్‌ ఏర్పాటుతోపాటు, సాంకేతికంగా మంచి పరిజ్ఞానం ఉన్న సిబ్బందిని నియమించేలా పోలీస్‌ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)