నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం

Published on Sun, 09/17/2023 - 03:15

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం 11 గంటలకు నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సెప్టెంబర్‌ 17న రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు తెలంగాణ పరిణామం చెందిన సందర్భంగా ప్రతిఏటా ఆ రోజున తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండావిష్కరణలు చేయనున్నారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వవిధానానికి అనుగుణంగా ఆదివారం రాజ్‌భవన్‌లో విమోచన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌ ప్రాంగణంలో గవర్నర్‌ ఉదయం 9.30 గంటలకు జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. 

విమోచన దినోత్సవం జరుపుకోవాలి: గవర్నర్‌ పిలుపు
హైదరాబాద్‌ విముక్తి పోరాటం దేశ స్వాతంత్య్ర సంగ్రామచరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. హైదరాబాద్‌ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని విడుదల చేశారు. విమోచన ఉద్యమంలో పోరాటయోధుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, మనం సంఘటితంగా పోరాడి సాధించిన విజయాలకు ఇది గుర్తుగా నిలుస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)