Breaking News

సభా సమయం.. నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ భేటీ

Published on Thu, 02/08/2024 - 01:10

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ మూడో శాసనసభ తొలి బడ్జెట్‌ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30కి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగిస్తారు. ఈ నెల 9న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం ఉంటాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తేదీన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.

కాగా బడ్జెట్‌లోని అంశాలపై 12 నుంచి చర్చ జరగనుంది. ఆరు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని భావిస్తుండగా, గురువారం స్పీకర్‌ అధ్యక్షతన జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బీఏసీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో విపక్ష పారీ్టల నేతలతో సంప్రదించి సభ నిర్వహణ తీరు తెన్నులపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.  

సకాలంలో సమాధానాలు ఇవ్వండి 
శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఉభయ సభల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇవ్వడంతో పాటు సమావేశాలు సజావుగా నడిచేందుకు ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించాలని సూచించారు. ఆఫీసర్‌ బాక్సులో అధికారులు తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అన్నారు.

పాత అసెంబ్లీ భవనంలోకి శాసనమండలిని తరలించే పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తా చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భద్రత, లాబీల్లోకి సందర్శకులు గుంపులుగా రావడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడటం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశాలు జరిగే సమయంలో మంత్రులు అందుబాటులో ఉండాల ని మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ కోరారు.  

ప్రోటోకాల్‌లో తప్పిదాలు జరగొద్దు: శ్రీధర్‌బాబు 
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు వచ్చేలా చూసేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించాలని సీఎస్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రస్తుత సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్‌ విషయంలో తప్పిదాలు జరగవద్దని అన్నారు. ప్రోటోకాల్‌ విషయంలో గతంలో తాను కూడా బాధితుడినని గుర్తు చేశారు.  

త్వరలో ఓరియెంటేషన్‌ కార్యక్రమం 
మండలిని అసెంబ్లీ ప్రాంగణంలోకి త్వరితగతిన తరలించేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు చెప్పారు. తొలిసారిగా శాసనసభ, శాసనమండలికి ఎన్నికైన సభ్యుల కోసం రెండురోజుల ఓరియెంటేషన్‌ కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేస్తా మన్నారు. ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్, బీర్ల ఐలయ్య, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ నర్సింహాచార్యులు, లెజిస్లేచర్‌ అడ్వైజర్‌ ప్రసన్నకుమార్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా పాత అసెంబ్లీ భవనంలోకి శాసనమండలిని తరలించాలనే నిర్ణయం నేపథ్యంలో బుధవారం మండలి చైర్మన్, స్పీకర్‌ తదితరులు పాత అసెంబ్లీ భవనంలోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)