Breaking News

12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.?

Published on Sat, 03/01/2025 - 17:53

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 12వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. 12వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 15వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. మార్చి చివరి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను రాష్ట్ర ప్రభుత్వ బృందం కలవనుంది.

కాగా, తెలంగాణ సర్కార్‌ శనివారం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలను ప్రారంభించనుంది. ప‌రేడ్ గ్రౌండ్‌లో మహిళా సంఘాల‌చే ఆర్టీసీ అద్దె బ‌స్సులు- మొద‌టి విడ‌త‌లో 50 బ‌స్సుల‌కు ప‌చ్చ జెండా ఊపి సీఎం ప్రారంభించ‌నున్నారు. మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాలు చెల్లింపు, 31 జిల్లాల్లో మ‌హిళా సంఘాల‌చే పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అయిల్ కంపెనీలో ఒప్పందాలు, 32 జిల్లాల్లో జిల్లాకు 2 మెగా వాట్ల చొప్పున 64 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల‌కు వ‌ర్చువ‌ల్‌గా సీఎం శంకు స్థాప‌న‌ చేయనున్నారు. 14 వేల అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల నియామ‌క నోటిఫికేష‌న్ ప్రభుత్వం విడుదల చేయనుంది.

ఇదిలా ఉండగా, ఇసుక‌తో పాటు ఇత‌ర ఖ‌నిజాల అక్ర‌మ త‌వ్వ‌కాలు, అక్ర‌మ స‌ర‌ఫ‌రాపై ఉక్కుపాదం మోపాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ‌నుల శాఖ‌పై శనివారం ఆయన స‌మీక్ష‌ నిర్వహించారు. క‌ఠిన చ‌ర్య‌ల‌తోనే అక్ర‌మాల‌ను అడ్డుకోగ‌ల‌మ‌ని, ప్ర‌భుత్వానికి ఆదాయం పెంచ‌గ‌లమన్నారు. ప్ర‌భుత్వంలోని నీటి పారుద‌ల‌, ఆర్‌అండ్‌బీ, పంచాయ‌తీరాజ్‌తో పాటు వివిధ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో చేప్ట‌టే ప‌నుల‌కు టీజీఎండీసీ నుంచే ఇసుక స‌ర‌ఫ‌రా చేసేలా చూడాల‌ని అధికారులను ఆదేశించారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేప‌ట్టే నిర్మాణ రంగ సంస్థ‌లకు అవ‌స‌ర‌మైన ఇసుక‌ను టీజీ ఎండీసీ ద్వారానే స‌ర‌ఫ‌రా చేయాలన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు స‌మీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువ‌గా వినియోగం జ‌రుగుతోందని.. త‌క్కువ మొత్తంలో ఇసుక అవ‌స‌ర‌మైన వారు కొనుగోలు చేసేలా న‌గ‌రానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గ‌నుల శాఖ ప‌రిధిలోని వివిధ ఖ‌నిజాల క్వారీల‌కు గ‌తంలో విధించిన జ‌రిమానాలు, వాటి వ‌సూళ్ల‌పైనా అధికారుల‌ను సీఎం ప్ర‌శ్నించారు. దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న మైన‌ర్ ఖ‌నిజాల బ్లాక్‌ల వేలానికి వెంట‌నే టెండ‌ర్లు పిల‌వాలని సీఎం ఆదేశించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)