Breaking News

రేపట్నుంచి బడ్జెట్‌ సన్నాహకాలు

Published on Fri, 01/23/2026 - 02:09

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌– 2026 సమావేశాలు ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రస్తుతం శాఖలవారీగా బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖలు ప్రగతి పద్దు, నిర్వహణ పద్దుకు సంబంధించి అంచనాలను ప్రాథమికంగా తయారు చేసింది. ఈ అంచనాలపై ఈనెల 24 నుంచి సచివాలయంలో రాష్ట్ర బడ్జెట్‌–2026 సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో శాఖల వారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చలు జరపనున్నారు.

సంబంధిత మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్లలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగుతాయి. ఇందుకు సంబంధించి భట్టి ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల వారీగా ఖరారు చేసిన సమీక్షల షె డ్యూల్‌ను ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా నోట్‌ జారీ చేశారు. ఈ ఆదేశాలను సంబంధిత మంత్రులు, ప్రభుత్వ శాఖలకు పంపించారు.

పాత, కొత్త పథకాలపై చర్చ 
బడ్జెట్‌ సన్నాహక సమావేశాల్లో ప్రభుత్వ శాఖలు రూపొందించిన అంచనాల ఆధారంగా చర్చిస్తారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు, డిమాండ్‌కు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతోపాటు ప్రభుత్వం ఇచి్చన హామీలకు అనుగుణంగా కొత్తగా అమలు చేయాల్సిన పథకాలపైనా చర్చించనున్నారు. పాత పథకాలకు బడ్జెట్‌ డిమాండ్‌తో పాటు కొత్త పథకాలకు బడ్జెట్‌ అవసరాలపై అంచనాకు రానున్నారు. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖతో పాటు సాధారణ పరిపాలన విభాగం, హోం, లా అండ్‌ ఆర్డర్, న్యాయ తదితర శాఖలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతుండటంతో ఆయా సమావేశాలకు సీఎం అధ్యక్షత వహిస్తారు. సమీక్షల అనంతరం కేంద్ర బడ్జెట్‌ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో మార్పులు చేస్తారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)