Breaking News

వెనుకబడిన వర్గాలకు చేయూత!

Published on Fri, 07/26/2024 - 05:38

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నిధుల కేటాయింపును గణనీయంగా పెంచింది. బీసీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్‌లో రూ.6,229 కోట్లు ఇవ్వగా.. ఈసారి సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా రూ.9,200.32 కోట్లను కేటాయించింది. వాస్తవానికి కొన్నేళ్లుగా బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్‌ కేటాయింపులు ఆశాజనకంగా లేవని.. ఈసారి ఊరట కలిగించేలా కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

⇒ వడ్డెర, కృష్ణబలిజ పూసల, వాల్మీకి బోయ, భట్రాజ, కుమ్మరి, శాలివాహన, సగర కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్లకు, మేదర కో–ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్లకు రూ.50కోట్ల చొప్పున మొత్తం రూ.450 కోట్లు కేటాయించారు.

⇒ తెలంగాణ తాడీ టాపర్స్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌కు రూ.68 కోట్లు.
⇒ ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు, చేనేతకారుల సహాయానికి రూ.450 కోట్ల గ్రాంటు..
⇒   నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌కు రూ.100 కోట్లు, వాషర్‌మెన్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌కు రూ.150 కోట్లు..
⇒  ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ వెల్ఫేర్‌ బోర్డులకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.

⇒  నీరా పాలసీకి రూ.25 కోట్ల గ్రాంటు ఇచ్చారు.
⇒ మైనారిటీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,200 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.798 కోట్లు అదనంగా రూ.3,002.60 కోట్లు కేటాయించారు.
⇒ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఈసారి రూ.2,736 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.2,131 కోట్లతో పోలిస్తే ఇది రూ.605 కోట్లు అదనం.
⇒ ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ పథకాల కోసం అన్ని సంక్షేమశాఖలకు కలిపి రూ.2,600 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.200 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల కింద బీసీ సంక్షేమ శాఖకు అధికంగా రూ.1,650 కోట్లు కేటాయించారు.

సంక్షేమ శాఖలకు కేటాయింపులివీ..
శాఖ    నిధులు (రూ.కోట్లలో)
ఎస్సీ సంక్షేమం    28,724.53
గిరిజన సంక్షేమం    15,123.91
బీసీ సంక్షేమం    9,200.32
మైనారిటీ సంక్షేమం    3,002.60
మహిళా, శిశు సంక్షేమం    2,736.00
కార్మిక సంక్షేమం    881.86

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)