Breaking News

ఎంసెట్‌ పరిధిలోకి నర్సింగ్‌ కోర్సులు

Published on Fri, 02/10/2023 - 00:57

సాక్షి హైదరాబాద్‌: బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు సీట్లను ఈ ఏడాది ఎంసెట్‌ బైపీసీ ర్యాంకులతో భర్తీ చేస్తారు. ఈ విషయాన్ని ఎంసెట్‌ నోటిఫికేషన్‌లో పొందుపరచనుండగా, నర్సింగ్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీచేయాలని 2021లో నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆదేశాలిచ్చింది. దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది.

అయితే ఆ ఆదేశాలు వచ్చేసరికే ప్రవేశాలు పూర్తికావడంతో ఆ ఒక్క ఏడాది మినహాయింపునిచ్చింది. 2022లో ఎంసెట్‌లో చేర్చినా.. సీట్లు నిండకపోవడంతో ఎంసెట్‌ ర్యాంకులతో నిమిత్తం లేకుండానే మెరిట్‌ ఆధారంగానే సీట్లను భర్తీచేశారు. తాజాగా ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సిన తరుణంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి ఇటీవలే ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రికి లేఖ రాశారు. ఎంసెట్‌లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సును సైతం చేర్చాలని ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో 9 ప్రభుత్వ, 85 ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 680, ప్రైవేట్‌ కాలేజీల్లో సుమారు 5వేల సీట్లున్నాయి. ఈ సీట్లను ఎంసెట్‌ బైపీసీ ర్యాంకులతో భర్తీ చేస్తారు. ­ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)