Breaking News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ‘గృహ నిర్బంధం’

Published on Wed, 08/13/2025 - 02:41

సాక్షి, హైదరాబాద్‌ / లాలాపేట: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడు తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి దేవాల యంలో మంగళవా రం తలపెట్టిన కుంకుమార్చన కార్యక్రమానికి హాజరుకాకుండా రాంచందర్‌రావును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు హౌస్‌అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందువులు పండుగ చేసుకుంటే, గుళ్లో పూజ చేసుకుంటే అరెస్టులు చేయడం ఏమిటో తనకు అర్థంకావడం లేదన్నారు. ఇలాంటి ఘటనలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటోందని విమర్శించారు. 

హర్‌ఘర్‌ తిరంగా, యాత్ర బైక్‌ ర్యాలీకి సిద్ధమవుతున్న తనను పోలీసులు హౌజ్‌ అరెస్టు చేయడం అవివేకమన్నారు. కాగా, రాంచందర్‌రావు ఇతర నాయకుల ‘గృహనిర్బంధం’పై బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఖండించారు.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి తన ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేసిందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.శిల్పారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మాజీ మేయర్‌ బండ కార్తీక చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు రాంచందర్‌రావు అరెస్టును ఖండించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)