Breaking News

"తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మించాలి"

Published on Mon, 12/29/2025 - 17:55

సాక్షి హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు(సోమవారం) ప్రారంభమయ్యాయి.  మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈసందర్భంగా రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో ప్రస్థావించారు. కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో రాష్ట్ర భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో మాదిరి తిరుపతిలోనూ తెలంగాణ భవన్ నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. 

రాష్ట్రానికి చెందిన భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాల అంశంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరారు. అదే విధంగా రాష్ట్రం నుంచి ఏటా అయ్యప్పస్వామి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు శబరిమలకు వెళుతుంటారని, సూదూర ప్రాంతం కావడంతో అక్కడ కూడా తెలంగాణ భవన్ నిర్మించే అంశం ప్రభుత్వం ఆలోచించాలని గంగుల కమలాకర్ ప్రభుత్వానికి సూచించారు. 

ఇదివరకే కర్ణాటక,  తమిళనాడు రాష్ట్రాలు తిరుపతిలో ఆ రాష్ట్రాలకు చెందిన భవన్‌లు నిర్మించుకున్నాయని దీంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజాపతినిధులు అక్కడికి వెళ్లినప్పుడు వారికి  ఇబ్బందులు కలగడం లేదన్నారు. కానీ తెలంగాణ ప్రజా ప్రతినిధులకు మాత్రం అక్కడ  ఇబ్బందులు ఎదురవుతున్నాయని  అందుకే తిరుపతిలో తెలంగాణ భవన్ కూడా నిర్మిస్తే ప్రజాప్రతినిధులకు సౌకర్యంగా ఉండడంతో పాటు ప్రాధాన్యత కూడా ఉంటుందని గంగుల కమలాకర్ ప్రభుత్వానికి నివేదించారు.


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)