Breaking News

వ్యవసాయం అంటే పంటలే కాదు.. వ్యాపారం కూడా!

Published on Fri, 12/05/2025 - 04:08

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయం అత్యాధునిక, లాభదా యక, వాతావరణ అనుగుణ ఆహార వ్యవస్థగా మారాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాన్ని ప్రకటించింది. ప్రతి రంగాన్ని సమూలంగా మార్చే వినూత్న విధానాలతో ‘తెలంగాణ విజన్‌ 2047’డాక్యుమెంట్‌లో నిర్దేశించుకుంది. 2047 నాటికి రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉండబోతుందనే అంశంపై వ్యవసాయశాఖ విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించింది. అందులో స్పష్టమైన విధానాలను పొందుపరిచారు. 

» క్లైమెట్‌ స్మార్ట్‌ వ్యవసాయం ..నేల ఆరోగ్యానికి సంబంధించి మొబైల్‌ సాయిల్‌ టెస్టింగ్, కమ్యూనిటీ సాయిల్‌ మిషన్‌లతో ప్రతి గ్రామానికి నేల ఆరోగ్య సేవలు అందిస్తారు. ఐఓటీ ఆధారిత మైక్రో ఇరిగేషన్‌ను 39.5 లక్షల ఎకరాల వరకు విస్తరించి ‘డిజిటల్‌ వాటర్‌ ఇంటెలిజెన్స్‌’ద్వారా నీటి వినియోగ నియంత్రణ చేస్తారు. 

» రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌లో భాగంగా అగ్రి రీసెర్చ్‌ హబ్‌గా వ్యవసాయ విశ్వవిద్యాలయాల ను అభివృద్ధి చేయడం ద్వారా శాస్త్ర సాంకేతి కతను వ్యవసాయానికి అనుసంధానం చేయ డం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్, నేచురల్‌ రిసోర్సెస్‌ రంగాల్లో అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం.

» 100 కొత్త పెరి–అర్బన్‌ క్లస్టర్లు, 20 సెమీ అర్బన్‌ జోన్లు , 100 ఎగుమతి కమోడిటీ క్లస్ట ర్లు, ధాన్యం కోసం ప్రత్యేక ట్రేడింగ్‌ వింగ్‌ ఏర్పాటు. 

» తెలంగాణను ‘గ్లోబల్‌ సీడ్‌ క్యాపిటల్‌’గా తీర్చిదిద్దే లక్ష్యంతో సర్టిఫైడ్‌ సీడ్‌ ఉత్పత్తి మూడు రెట్లు పెంచడం, తెలంగాణ సీడ్‌ రీసెర్చ్‌ పార్క్, రాష్ట్ర విత్తన మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం. 

» నెక్ట్స్‌ జెన్‌ అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ద్వారా 500 అ గ్రిటెక్‌ క్లస్టర్ల ద్వారా 25 లక్షల ఎకరాలకు స్మార్ట్‌ వ్యవసాయం అందించడం. వ్యవసా య లాజిస్టిక్స్‌కు ప్రత్యేక మౌలిక వసతుల క ల్పన, 50 లక్షల టన్నుల గిడ్డంగుల విస్తర ణ, కోల్డ్‌ స్టోరేజ్, ప్రాసెసింగ్‌ సెంటర్ల విస్తరణ.

» వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్‌ వంటి సంస్థలతో కలిసి కొత్త బయోఫోర్టిఫైడ్‌ పంట జాతులను అభివృద్ధి చేయడం, 25 లక్షల ఎకరాల్లో న్యూట్రిషన్‌ స్మార్ట్‌ క్లస్టర్లు రూపొందించడం.

» 2047 నాటికి 10 మిలియన్‌ టన్నుల పాలు, 35 మిలియన్‌ టన్నుల మాంసం వార్షిక ఉత్పత్తితోపాటు, పౌల్ట్రీలో తెలంగాణను నంబర్‌వన్‌గా నిలబెట్టే ప్రణాళికను రూపొందించారు. ఆక్వా కల్చర్‌ ద్వారా 5 రెట్ల వృద్ధి లక్ష్యంగా నిర్దేశించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)