Breaking News

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. మూడు బిల్లులకు ఆమోదం!

Published on Thu, 02/20/2025 - 07:54

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక భేటీలో బీసీలకు స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రతిపాదించనుంది.

అసెంబ్లీలో చర్చ అనంతరం ఈ బిల్లులను ఆమోదిస్తారు. ఆపై వీటి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఎస్సీల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్‌ గడువు పొడిగించిన నేపథ్యంలో ఆ కమిషన్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించనున్నారు. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం అనంతరం చట్టంగా రూపాంతరం చెందనుంది. దీంతోపాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కూడా అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకోనుంది. ఈ మూడు బిల్లుల ముసాయిదా రూపకల్పనలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం. త్వరలోనే జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మూడు ముసాయిదా చట్టాలకు తుదిరూపు లభించనుంది.

బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెల మూడోవారంలో!
2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ ఆమోదం కోసం బడ్జెట్‌ సమావేశాలను వచ్చే నెల మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది మార్చి 31లోపు బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి కావడంతో మూడో వారంలో బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)