నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

Published on Sat, 08/30/2025 - 04:42

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు సజావుగా జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకరించాలని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఆదేశించారు. సభ్యులు అడిగే సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందజేయాలన్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో శుక్రవారం స్పీకర్‌ తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు.

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ నరసింహాచార్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన చర్చలు జరిగే సమయంలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులు, సభ్యులకు తగిన సమాచారం అందజేయాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ఆదేశించారు.

భారీ వర్షాలతో కొన్ని మార్గాల్లో రోడ్లు దెబ్బతిన్న నేపథ్యంలో సభ్యులు నిర్ణీత సమయానికి సభకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తు సమాచారం సేకరించి అడ్డుకోవడం ద్వారా సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్‌ సూచించారు. కాగా, శాసనమండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నోడల్, లైజనింగ్‌ ఆఫీసర్లను నియమించాలని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)