Breaking News

తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు!

Published on Wed, 10/04/2023 - 11:26

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులపాటు ఎన్నికల సన్నాహాక భేటీలు వరుసగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు తుది ఓటర్ల జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈసీ డేటా ప్రకారం సెప్టెంబర్‌ 18వ  తేదీ వరకు.. కొత్త ఓటర్ల నమోదుకు 13.06 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వివరాల సవరణ కోసం 7.77 లక్షల దరఖాస్తులు ఉండగా.. పేర్ల తొలగింపునకు 6.26 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్‌ దరఖాస్తులన్నీ పరిష్కరించాకే.. తుది జాబితా విడదలు చేయాలని కోరుతున్నాయి. ఈ విజ్ఞప్తిని ఈసీ స్పందన  ఏంటన్నది తెలియాల్సి ఉంది. 

మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశాలు హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు - ఎస్పీలు, సీపీలతో ఇప్పటికే EC మీటింగ్ మొదలైంది. ఇవాళ రెండు సెషన్లుగా ఈ భేటీ జరగనుంది. మొదటి సెషన్‌లో అధికారులు చెప్పే అంశాల్ని కేంద్ర బృందం విననుంది. ఇక రెండో సెషన్‌లో అధికారులకు ఈసీ దిశానిర్దేశం చేస్తుంది. మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్రం ఎన్నికల సంఘ బృందం పరిశీలించింది.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)