Breaking News

HYD: నాంపల్లిలో అర్ధరాత్రి హైడ్రామా.. ఏసీబీ అదుపులో ఈఈ, ఏఈలు..

Published on Fri, 05/31/2024 - 09:30

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలోని నీటి పారుదల శాఖలో ఏసీబీ సోదాలు ముగిశాయి. నాంపల్లిలో హైడ్రామా తర్వాత నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

వివరాల ప్రకారం.. నాంపల్లిలో రెడ్‌ హిల్స్‌లోని నీటి పారుదల శాఖ ఆఫీసులో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్‌లు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో, లంచం డిమాండ్‌కు సంబంధించి కీలక అధికారి పరారీ కావడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. రాత్రి నాలుగు గంటల పాటు శ్రమించి నాలుగో వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు.

కాగా, ఒక వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ ఆమోదం కోసం నీటిపారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలయ అధికారులను సంప్రదించాడు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్ రూ.2.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీనికి అంగీకరించిన సదరు వ్యక్తి ముందుగా రూ.1.5లక్షలు ఇచ్చేందుకు అధికారులు డీల్‌ కుదుర్చుకున్నారు. మరో లక్ష తర్వాత చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇదంతా గురువారం సాయంత్రం ఈఈ ఆఫీసులో జరగాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఈలోపే బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు దాడులు జరిపి వారి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వివరాలను అధికారులు కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది.

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)