Breaking News

టీచర్‌ పెళ్లిలో ట్విస్ట్‌.. నేను ప్రేమిస్తున్నా అంటూ ఉపాధ్యాయుడు..

Published on Sun, 05/18/2025 - 11:47

సాక్షి, పాల్వంచ: వారిద్దరూ టీచర్లుగా పనిచేస్తున్నారు.. ఆమె భర్తకు దూరమైంది. అతడికి భార్య లేదు. దీంతో, రెండు కుటుంబాల పెద్దలు వారిద్దిరికీ పెళ్లి కుదిర్చారు. జీవితంలో రెండో అధ్యాయాన్ని ప్రారంభించాలనుకున్న ఈ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. పెళ్లి వేడుకకు వచ్చిన మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ‘ఆపండి... నేను ఆమెను ఇష్టపడ్డాను.. నేనే పెళ్లి చేసుకుంటాను’ అంటూ గందరగోళం సృష్టించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ వింత ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. పాల్వంచకు చెందిన 29 ఏళ్ల మహిళ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది. ఆమెకు ఓ పాప కూడా ఉంది. అయితే, కొన్నాళ్లకు భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం స్థానిక ప్రైవేటు స్కూల్లో పనిచేస్తోంది. మరోవైపు, ఖమ్మంలో పనిచేస్తున్న 33 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ఆమెకు రెండో వివాహం నిశ్చయించారు. పెళ్లయిన కొన్నాళ్లకే అతని భార్య చనిపోయింది. ఆయనకు కూడా ఇది రెండో వివాహం. ఇరు కుటుంబాల పెద్దలు వీరిద్దరికీ వివాహం జరిపించాలని నిశ్చయించారు. శనివారం సాయంత్రం పాల్వంచలోని ఓ ప్రార్థనా మందిరంలో పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు.

కాసేపట్లో పెళ్లి అయిపోతుందన్న సమయంలో మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారిగా.. నాకు వధువు అంటే ఇష్టం. ప్రైవేటు స్కూల్‌లో పనిచేసేటప్పుడు వధువుతో పరిచయం ఏర్పడింది. నాకు పెళ్లయినా పిల్లలు పుట్టలేదు. నా భార్యకు విడాకులిచ్చి ఈమెను పెళ్లాడతా అంటూ రచ్చ చేశాడు. ఈ సందర్భంగా వధువు మాట్లాడుతూ.. అతడు గతంలో బతిమిలాడగా తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పాను. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. అలాగే, ఆమెతో వివాహేతర సంబంధమున్నట్లు వరుడికి సైతం ఒకసారి ఫోన్‌ చేయడం గమనార్హం. ఈ క్రమంలో అతడిని పట్టుకునేలోపే అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. ఈ రచ్చ కారణంగా వరుడితోపాటు అతడి బంధువులు వెళ్లిపోవడంతో వివాహం ఆగిపోయింది. అనంతరం, యువతి, ఆమె కుటుంబ పోలీసులను ఆశ్రయించారు. అతడితో ఫిర్యాదు చేశారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)