Breaking News

హిడ్మా దంపతులకు కన్నీటి వీడ్కోలు

Published on Fri, 11/21/2025 - 03:59

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తిలో జరిగాయి. ఈ నెల 18న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిడ్మా, ఆయన భార్య రాజీ మృతదేహాలతో కుటుంబీకులు గురువారం ఉదయం 8 గంటలకు పువర్తికి చేరారు. 

ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామాల ఆదివాసీలు వందలాదిగా పువర్తికి చేరుకున్నారు. ఆదివాసీ పద్ధతులను అనుసరిస్తూ తలపై రెండు చేతులు ఉంచుకొని రున్‌–సాన్‌ అంటూ రోదించారు. మధ్యాహ్నం 11 గంటలకు హిడ్మా మృతదేహాన్ని దహనం చేసేందుకు తీసుకెళ్లగా స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వారితో పువర్తిలో ఇటీవల వేసిన విశాలమైన రోడ్లు కిక్కిరిసిపోయాయి. 

ఒకే చితిపై హిడ్మా–రాజీ మృతదేహాలను ఉంచి దహన కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆదివాసీ సంప్రదాయాలను అనుసరిస్తూ చితికి నిప్పంటించడానికి ముందు గ్రామస్తులు టవళ్లు, దుప్పట్లు, బ్లాంకెట్స్‌.. ఇలా ఏదో ఒక వ్రస్తాన్ని చితిపై పేర్చారు. 

హిడ్మా తల్లి పోజే ఇటీవల ప్రభుత్వం అందించిన కొత్త బ్లాంకెట్‌ను హిడ్మా చితిపై వేసింది. హిడ్మా అంత్యక్రియల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతాదళాలు బందోబస్తు ఏర్పాటు చేశాయి. గురువారం స్థానికంగా జరిగే సంతను సైతం రద్దు చేశారు. 

చావులోనూ తోడుగా 
పువర్తిలో 1990 దశకంలో మావోయిస్టుల ఆధ్వర్యంలో చెరువు నిర్మాణ పనులు జరుగుతుండగా..అక్కడి దళంతో పదేళ్ల హిడ్మాకు పరిచయమైంది. ఆ తర్వాత 1999లో పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ ఏర్పాటయ్యాక, ఒక ప్లాటూన్‌లోకి హిడ్మాను తీసుకున్నారు. జేగురుగొండ దళ కమాండర్‌గా హిడ్మా ఉన్నప్పుడే మరోదళంలో రాజీ కీలక సభ్యురాలిగా ఎదిగింది. 

మొదట హిడ్మానే పెళ్లి ప్రస్తావన తెచ్చాడని, ఆరంభంలో ప్రతిపాదనను రాజీ నిరాకరించినా, చివరకు రెండేళ్ల తర్వాత వారిద్దరూ కలిసి విప్లవ జీవన ప్రయాణం మొదలుపెట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. పార్టీ నియమాలను అనుసరించి కలిసి జీవించేందుకు ముందుగానే ఇద్దరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నట్టుగా తెలిపారు. సుమారు రెండు దశాబ్దాలు విప్లవ పోరాటంలో కలిసి నడిచిన హిడ్మా–రాజీ అంత్యక్రియలను ఒకే చితిపై పూర్తిచేశారు. 

మాట వింటే మట్టుబెట్టారు : హిడ్మా కుటుంబ సభ్యులు 
ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి విజయ్‌శర్మ పిలుపు మేరకు లొంగిపోయేందుకు వచ్చిన హిడ్మా, ఆయన భార్య రాజీ ఇతర అనుచరులను ప్రభుత్వ దళాలు ప్రాణాలతో పట్టుకొని కాల్చి చంపాయని ఆయన కుటుంబీకులు ఆరోపించారు. ఆపై ఎన్‌కౌంటర్‌ అని చెబుతున్నారని పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త సోనిసోరితో కలిసి గురువారం పువర్తిలో వారు మీడియాతో మాట్లాడారు. హిడ్మా కుటుంబసభ్యులు గోండు భాషలో మాట్లాడుతుండగా సోనిసోరి హిందీలోకి అనువదించారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)