Breaking News

9న సీఎం చేతుల మీదుగా ఉపాధ్యాయ నియామక పత్రాలు

Published on Mon, 10/07/2024 - 04:37

హైదరాబాద్‌: ఈనెల 9 తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామ క పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ఆదివారం సీఎస్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ, దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీచేస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించి సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారని, సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్‌ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారని తెలిపారు. 

ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరూ తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలలోపే ఎల్‌.బి.స్టేడియానికి చేరేలా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వారిని హైదరాబాద్‌కు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో ఒక పోలీస్‌ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సూచించారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)