Breaking News

తార్నాక జంక్షన్‌..రీ ఓపెన్‌!

Published on Fri, 04/18/2025 - 07:53

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు దశాబ్ద కాలంగా మూతపడిన తార్నాక జంక్షన్‌ను నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఎట్టకేలకు ప్రయోగాత్మకంగా తెరవనున్నారు. శుక్రవారం నుంచి మే 2 తేదీ వరకు ఈ చౌరస్తాను ఓపెన్‌ చేయనున్నారు. ఈ మధ్యకాలంలో అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి.. ఆపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు గురువారం సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ జోయల్‌ డెవిస్‌ ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ– లాలాపేట వైపుల నుంచి రాకపోకలు సాగించడానికి గతంలో ఈ జంక్షన్‌ను వినియోగించే వాళ్లు. 

 తార్నాక ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ముందు హబ్సిగూడ–మెట్టుగూడ వైపుల నుంచి రాకపోకలు సాగించడానికీ ఈ జంక్షన్‌ ఉపకరించింది. 1990 నుంచి తార్నాక ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచి్చంది. అయితే.. తార్నాక చౌరస్తాను మాత్రం 2015 జూలై వరకు తెరిచే ఉంచారు. ఆపై మూసివేయడంతో పాటు లాలాపేట నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళ్లే వాహనాలు హెచ్‌ఎండీఏ కార్యాలయం వరకు వెళ్లి యూ టర్న్‌ చేసుకుని వచ్చేలా.. అలాగే యూనివర్సిటీ నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనాలు రైల్వే డిగ్రీ కళాశాల వద్ద యూ–టర్న్‌ తీసుకుని వచ్చేలా మార్పుచేర్పులు చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ముందు ఈ సిగ్నల్‌ వద్దే ఒకే పోలీసు అధికారి విధులు నిర్వర్తించేవారు. 

అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఖ్య ఎనిమిదికి పెంచాల్సి వచి్చంది. దీంతో పాటు ఇతర పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు 2015లో ఈ జంక్షన్‌ను మూసేశారు.

అనేక విజ్ఞప్తుల నేపథ్యంలో నిర్ణయం... 
ఈ చౌరస్తాను మళ్లీ తెరవాలంటూ కొన్నేళ్లుగా అనేక మంది ట్రాఫిక్‌ విభాగానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు పరిస్థితులు లేవని, ట్రాఫిక్‌ జామ్స్‌ కావని చెబుతున్నారు. ఈ చౌరస్తా మూసేయడంతో ‘యూ–టర్న్‌’ కోసం దాదాపు కిలోమీటరు ముందుకు వెళ్లి, తిరిగి రావాల్సి వస్తోందని విజ్ఞప్తి చేస్తున్నారు. యూ టర్న్స్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ జామ్స్‌ జరుగుతుండటాన్నీ ట్రాఫిక్‌ అధికారులు గుర్తించారు. దీంతో శుక్రవారం నుంచి ఈ జంక్షన్‌ను ప్రయోగాత్మకంగా రీ–ఓపెన్‌ చేయాలని నిర్ణయించారు. గతానికి భిన్నంగా రూట్‌ ఇస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ట్రాఫిక్‌ చీఫ్‌ జోయల్‌ డెవిస్‌ కొన్ని కీలక సూచనలు చేశారు.  
⇒ ఓయూ వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా లాలాపేట వైపు, కుడివైపు తిరిగి హబ్సిగూడ వైపు వెళ్లే అవకాశం ఉంది. 
⇒  లాలాపేట వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఓయూ వైపు వెళ్లడానికి, కుడి వైపు తిరిగి మెట్టుగూడ వైపు రావడానికి అవకాశం ఉంది.  
⇒ మెట్టుగూడ వైపు నుంచి వచ్చే వాహనాలు మాత్రం ఈ చౌరస్తా వద్ద కుడివైపు తిరిగి ఓయూ వైపు వెళ్లే అవకాశం లేదు. నేరుగా హెచ్‌ఎండీఏ కార్యాలయం వరకు వెళ్లి, యూ టర్న్‌ తీసుకుని వచి్చ, చౌరస్తా వద్ద ఎడమ వైపు తిరిగి ఓయూ రూట్‌లోకి వెళ్లాలి. 
⇒ హబ్సిగూడ వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా తార్నాక జంక్షన్‌ వద్ద కుడి వైపు తిరిగి లాలాపేట వైపు వెళ్లే అవకాశం లేదు. ఈ వాహనాలు ఎడమ వైపు తిరిగి, రైల్వే డిగ్రీ కాలేజీ వరకు వెళ్లి యూ టర్న్‌ తీసుకోవాలి. ఆపై చౌరస్తా వరకు వచ్చి ఎడమ వైపు తిరిగి లాలాపేట వైపు వెళ్లాలి.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)