Breaking News

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు!.. ఇదో వృద్ధ దంపతుల గా(వ‍్య)థ

Published on Sat, 12/07/2024 - 13:59

సంస్థాన్‌ నారాయణపురం(నల్గొండ): తాము కొంత భూమి అమ్ముకుంటే.. ఆ భూమిని కొనుగోలు చేసిన వారికి తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వృద్ధ దంపతులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన జక్కడి బాల్‌రెడ్డికి 40ఎకరాల భూమి ఉంది. తన కుమారుడు జక్కడి శ్రీనివాస్‌రెడ్డికి 36 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయగా ఇంకా బాల్‌రెడ్డి పేరు మీద 4ఎకరాల 10గుంటల భూమి ఉంది. 

కుమారుడు తమ బాగోగులు పట్టించుకోకపోడవంతో బాల్‌రెడ్డి తన పేరు మీద ఉన్న భూమిని ఇతరులకు విక్రయించాడు. భూమి కొనుగొలుదారు రిజిస్ట్రేషన్‌ కోసం బుధవారం స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. గురువారం 12గంటలకు రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుక్‌ అయ్యింది. తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేయకపోవడంతో బాల్‌రెడ్డి అధికారులను ప్రశ్నించాడు. రిజిస్ట్రేషన్‌ చేయవద్దని బాల్‌రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశాడని, దీంతో రిజిస్ట్రేషన్‌ నిలిపివేస్తున్నానని తహసీల్దార్‌ తెలిపారు. తమ భూమి అమ్ముకుంటే ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేయరంటూ తహసీల్దార్‌తో బాల్‌రెడ్డి వాదించాడు.

 వృద్ధ దంపతులు సుమారు మూడు గంటలకు పైగా తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. చివరకు రిజిస్ట్రేషన్‌ చేయడంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ విషయమై తహసీల్దార్‌ కృష్ణను వివరణ కోరగా.. బాల్‌రెడ్డికి కుంటుంబ సభ్యులతో మాట్లాడుకోమని కొంత సమయం ఇచ్చామని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ ప్రకియ పూర్తిచేసినట్లు తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)