Breaking News

ఆర్‌ఎస్‌యూ నుంచి అగ్రనేత దాకా..

Published on Sat, 11/29/2025 - 04:14

కోరుట్ల: విద్యార్థి దశలో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌కు నాయకత్వం వహించి..మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగిన జగిత్యాల జిల్లా కోరుట్లవాసి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ లొంగుబాటలో ఉన్నట్టు తెలిసింది. ఆరు నెలల క్రితం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిరుపతి బాధ్యతలు చేపట్టినట్టుగా జరిగిన ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆపరేషన్‌ కగార్‌ తీవ్రతరమైంది. ఈ క్రమంలోనే తిప్పిరి తిరుపతి ఎన్‌కౌంటర్‌ అయ్యాడా? లేక లొంగిపోయాడా..? అన్న విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

ఆయన ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం. వారం రోజుల క్రితం తిరుపతి అంగరక్షక వలయ సభ్యులు విజయవాడలో పోలీసులకు చిక్కినట్టుగా ప్రచారం జరగడం..ఆ సమయంలోనే తిరుపతి పోలీసు­లకు చిక్కి ఉంటాడన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ వెంటనే ఆయన తమ్ముడు తిప్పిరి గంగాధర్‌ తన అన్నను అరెస్టు చేసి ప్రాణాలతో అప్పగించాలన్నారు. దీంతో వారం రోజుల పాటు తిరుపతి ఏమయ్యాడన్న సమాచారమే లేదు. 

చివరకు ఆయన లొంగుబాటు సమాచారం బంధుమిత్రులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆపరేషన్‌ కగార్‌ తీవ్రతరం కావడంతో లొంగిపోవాలని తిరుపతి కుటుంబసభ్యులు పలుమార్లు మీడియాను ఆశ్రయించారు. అతడి చిన్న తమ్ముడు గంగాధర్‌ కుమార్తె సుమ కూడా బహిరంగ ప్రకటన చేశారు. అయినా తిరుపతి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.

దశాబ్దాల ఎదురుచూపులు
నలభై ఏళ్లుగా అన్న లొంగిపోవాలని ఇంటిల్లిపాది కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూశాం. ఎట్టకేలకు ఆయన లొంగిపోతాడన్న సమాచారం మాకు ఎనలేని సంబరాన్ని ఇచ్చింది. మేమంతా ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన క్షేమంగా ఉండడమే మాకు కావాల్సింది.    –తిప్పిరి గంగాధర్, తిరుపతి తమ్ముడు

పెద్దనాన్న వస్తే ఎంతో హ్యాపీ
మా తాత–అమ్మమ్మ ఉన్నప్పటి నుంచి వారు ఎన్నోసార్లు పెద్దనాన్నను లొంగిపోవాలని కోరారు. అప్పటి నుంచి మా కుటుంబం మొత్తం ఆయన రాక కోసం నిరీక్షించింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన్ను చూడలేదు. ఆయన ఇంటికి వస్తే నా కల నెరవేరుతుంది.  – సుమ, తిరుపతి తమ్ముడి కుమార్తె

తిరుపతి తెలివైన స్టూడెంట్‌ 
తిరుపతితో ఇంటర్‌లో కొన్నాళ్లు కలిసి చదివాను. ఆయన తెలివైన స్టూడెంట్‌. మాథ్స్‌ అలవోకగా వంటపట్టించుకునే వాడు. మొదటి నుంచి చురుకైన వ్యక్తి. పేదలకు అన్యాయం జరిగితే సహించేవాడు కాదు. అజ్ఞాతంలోకి వెళ్లాక ఎవరితో టచ్‌లో లేడు.  – బక్కయ్య, తిరుపతి క్లాస్‌మేట్, రిటైర్డ్‌ వెటర్నరీ డాక్టర్, కోరుట్ల  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)