Breaking News

సంక్షేమ పథకాల విస్తృతికే సర్వే

Published on Tue, 11/19/2024 - 02:51

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతపర్చేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్టు రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం అన్ని రకాల అంశాలతో ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వ హిస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 17వ తేదీనాటికి రాష్ట్రవ్యాప్తంగా 58.3%  ఇళ్లను సర్వే చేశామని, నెలాఖరులోగా నూరుశాతం సర్వే పూర్తి చేస్తామన్నారు.

ఇప్పటికే సర్వే చేసిన ఇళ్లకు సంబంధించి వివరాలను కంప్యూ టరీకరిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రజల స్థితి గతులు తెలుసుకొని ప్రస్తుతం అమలు చేస్తున్న పథ కాలను విస్తృతం చేయడంతోపాటు కొత్త పథకాల అమలు కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగ పడుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా సర్వే ప్రక్రియను నిర్వ హిస్తోందన్నారు. తాజాగా చేప డుతున్న సర్వే దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.

మంచి ఉద్దేశంతో చేపడుతున్న సర్వేను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అధికారులకు వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాల్లో కోతపడుతుందని, పలు రకాల బెనిఫిట్స్‌ ఆగిపోతాయంటూ ప్రతిపక్ష పార్టీలు దుర్మార్గంగా మాట్లాడుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసిందని, కానీ ఆ సర్వేకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదన్నారు. ప్రజల ఆస్తులు తెలుసుకొని వాటిని కొల్లగొట్టేందుకు అప్పటి సర్వేను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టే సర్వే దేశానికే ఆదర్శంగా నిలిపేలా ఉంటుందని చెప్పారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)