Breaking News

‘గడ్డం’ బ్రదర్స్‌ దూరం.. దూరం!

Published on Sat, 10/04/2025 - 12:50

మంచిర్యాల జిల్లా: దసరా వేడుకల వేళ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గురువారం రాత్రి ఆసక్తికర, ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటు చేసుకుంది. విజయదశమి వేడుకల్లో భాగంగా సింగరేణి తిలక్‌ స్టేడియంలో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌తో పాటు ఆయన సోదరుడు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

 రాత్రి 7.15గంటల ప్రాంతంలో మంత్రి వివేక్‌ స్టేడియంకు రాగా.. ఎమ్మెల్యే వినోద్‌ పాల్గొనకపోవడం సభికులను ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతసేపటి తర్వాత మంత్రి వివేక్‌ తన ప్రసంగం ముగించి 7.35గంటలకు మందమర్రిలో నిర్వహించే రాంలీల కార్యక్రమానికి హాజరు కావాలంటూ సభికులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసి వేదిక దిగి వెళ్లిపోయారు. మంత్రి వెళ్లిపోయిన విషయాన్ని కొందరు సమాచారం ఇవ్వడంతో అరగంట తేడాతో ఆయన సోదరుడు వినోద్‌ మైదానానికి చేరుకున్నారు.

 అప్పటివరకు బాలికల సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులు కదలకుండా చూశారు. తమ్ముడు హాజరైన కార్య క్రమానికి అందుబాటులో ఉండి కూడా ఎమ్మెల్యే హాజరు కాకపోగా.. క్యాంపు కార్యాలయానికి వెళ్లి అన్నను తమ్ముడు కలువకపోవడం సభికులు, పుర ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఈ సంఘటన తోబుట్టువుల మధ్య నెలకొన్న అసమ్మతికి నిదర్శనమని పలువురు పేర్కొనడం గమనార్హం. ఇద్దరి మధ్య ఎందుకు పొరపొచ్చాలు వచ్చాయో తెలియ దు కానీ ముఖ్య అతిథులుగా హాజరు కావాలి్సన వినోద్, వివేక్‌ దూరం దూరంగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వీరి తీరుపై పురప్రజలు పలు రకాలుగా చర్చించుకోవడం వినిపించింది. ఈ ఘటన కాంగ్రెస్‌ శ్రేణులను కూడా గందరగోళానికి గురి చేసి చర్చనీయాంశంగా మారింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)