Breaking News

TG: పవర్‌ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్‌

Published on Tue, 07/16/2024 - 13:13

సాక్షి,న్యూఢిల్లీ:  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వేసిన విద్యుత్‌  కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. కమిషన్‌ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 16) విచారణ జరిపింది. 

పిటిషన్‌ను విచారించిన సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్‌ చైర్మన్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డిని మార్చాలని బెంచ్‌ ఆదేశించింది. ఈ సందర్భంగా ‌ కమిషన్‌  చైర్మన్‌ ఎల్‌.నర్సింహారెడ్డి తీరుపై సీజేఐ అసంతృప్తి  వ్యక్తం చేశారు. 

ప్రెస్‌మీట్‌ పెట్టి విచారణకు సంబంధించిన విషయాలపై ఓపెన్‌గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు.న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనిపించాలని వ్యాఖ్యానించారు. 

కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్‌ను మార్చడానికి తెలంగాణ  ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలిసింది. లంచ్‌ తర్వాత కొత్త చైర్మన్‌ ఎవరనేది చెబుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 

దీంతో పిటిషన్‌ విచారణను లంచ్‌ తర్వాతకు కోర్టు వాయిదా వేసింది.  విచారణలో కేసీఆర్‌ తరపున సీనియర్‌న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్‌ సింఘ్వి వాదనలు వినిపించారు.  

అడ్వకేట్‌ జనరల్‌తో  సీఎం రేవంత్‌ మంతనాలు .. కొత్త చైర్మన్‌ ఎవరనేదానిపై చర్చ 

పవర్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎల్‌.నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. 

ఆదేశాల గురించి తెలియగానే కలెక్టర్ల సమావేశ హాల్‌ నుంచి వెళ్లి అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) సుదర్శన్‌రెడ్డితో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  కొత్త చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్నదానిపై  సీఎం ఏజీతో చర్చిస్తున్నట్లు సమాచారం. 

 

 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)