సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు షాక్‌

Published on Mon, 01/12/2026 - 13:39

సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు అర్హత లేదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేసింది.

అయితే, పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్‌ అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అనంతరం, తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు అర్హత లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో, తమ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని అభిషేక్‌ సింఘ్వీ తెలిపారు. 

రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది. అయితే, గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని ధర్మాసనం సూచనలు చేసింది. దీంతో, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు తెలిపింది.

పోలవరం-నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)