Breaking News

గెజిట్‌పై స్టే ఇవ్వలేం!

Published on Thu, 05/08/2025 - 00:59

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి పరీవాహకంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)కు అప్పగించాలని ఆదేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై ప్రస్తుత పరిస్థితిలో స్టే విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గతంలో తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన డివిజన్‌ బెంచి విచారణ జరిపింది. 

కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న వాటాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు గాను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్‌ 3 కింద కృష్ణా ట్రిబ్యునల్‌–2కు కేంద్రం అదనపు మార్గదర్శకాలు (టీఓఆర్‌) జారీ చేసిన నేపథ్యంలో అంతకు ముందు జారీ చేసిన గెజిట్‌పై స్టే విధించాలని తెలంగాణ తరఫు న్యాయవాది వాదించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు స్టేను కోరుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, గెజిట్‌ ఇంకా అమల్లోకి రాలేదని బదులిచ్చారు. ‘అమల్లోకి రానప్పుడు స్టే ఎందుకు? అలాంటి ఉపశమనం ఇవ్వలేము’అని కోర్టు స్పష్టం చేసింది. 

ఈ విషయంలో వాదనలు విని తుది తీర్పు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ జరగలేదని, ఈ పరిస్థితిలో రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను కృష్ణా బోర్డుకు అప్పగించడం సరికాదని తెలంగాణ న్యాయవాది కోర్టుకు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంపిణీకి ఓ ప్రాతిపదికన లేనప్పుడు కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం తగదన్నారు. 

కాగా, నీటి పంపకాలను కృష్ణా ట్రిబ్యునల్‌–2 తేల్చలేదని, ఈ పరిస్థితిలో స్టే ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. కేసు తుదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరిపేందుకు గాను కృష్ణా ట్రిబ్యునల్‌–2కు అదనపు మార్గదర్శకాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టులోని మరో ధర్మాసనం విచారించనుంది.  

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)