Breaking News

నాగం జనార్ధన్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Published on Wed, 05/21/2025 - 19:19

ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నాగం జనార్ధన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బివి.నాగరత్నం, జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.

నాగం జనార్ధన్‌రెడ్డి తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ తన వాదనలు వినిపిస్తూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పెద్ద ఫ్రాడ్ జరిగిందన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2426 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం 65 శాతం  పంపులు, మోటార్ల కోసం బీహెచ్ఈఎల్‌కు చెల్లింపులు చేయాలి. 35 శాతం సివిల్ వర్క్స్‌కు మేఘాకు చెల్లింపులు చేయాలి.. కానీ, అంతర్గత ఒప్పందం ప్రకారం బీహెచ్ఈఎల్‌కు 65 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. మేఘాకు 80 శాతం చెల్లింపులు జరిగాయి. 65:35 నుంచి 20:80 కు ఎలా మారింది. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ వాదనలు వినిపించారు.

 న్యాయవాది ముకుల్ రోహతగి తన వాదనలు వినిపిస్తూ.. ‘‘తెలంగాణ హైకోర్టులో దీనికి సంబందించిన ఐదు పిటిషన్లు కొట్టివేశారు.. ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని స్పష్టం చేసింది. సివిసి కూడా ఇందులో ఏమి లేదని తేల్చింది. ఎస్టిమేషన్ పెంచడాన్ని తప్పు పడుతున్నారు. బీహెచ్‌ఈఎల్ కూడా ఇందులో ఫిర్యాదు చేయలేదు. ఏదో ఒక డాక్యుమెంట్ తెచ్చి కేసులు వేస్తున్నారు. పాలమూరు - రంగారెడ్డి  ప్రాజెక్ట్ బాగా పని చేస్తోంది’’ అని ముకుల్‌ రోహతగి తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)